కూకట్ పల్లి ; అక్టోబర్ 28(వాయిస్ టుడే): ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూకట్ పల్లి లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుంది. ఇప్పటికే టికెట్ స్థానికేతరులకు కేటాయించారని లోలోపల కుమ్ములాటలు జరుగుతుంటే తాజాగా మూసాపేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు చున్నూ పాషా కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాజీ కార్పోరేటర్ తూము శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఐటీ ,మున్సిపల్ శాఖ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ను కలిసి గులాబీ కండువా కప్పుకున్నారు. తెలంగాణ రథసారథి కేసిఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఎంతగానో అభివృద్ధి చెందిందని, హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలు కాపాడటానికి పటిష్టమైన చర్యలు తీసుకున్నారని, ముస్లిం మైనారిటీల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసిఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని, అదేవిధంగా కూకట్ పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గతంలో ఏ నాయకుడు చేయని అభివృద్ధిని చేసి చూపెట్టారని, వారిని మరోసారి ఎమ్మెల్యే గా గెలిపించుకోవడం మా బాధ్యత అని చున్నూ పాషా అన్నారు. కేటీఆర్ ను కలిసిన వారిలో ఫతేనగర్ డివిజన్ కార్పోరేటర్ పండాల సతీష్ గౌడ్, మూసాపేట్ డివిజన్ అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్, జగదీష్, రషీద్, ఎస్. నర్సింహ, శశాంక్, అన్నూ, అసీఫ్, షేరు, ఖాజా పాషా, సజద్, ఫయాజ్, శివ ప్రసాద్ తదితరులు ఉన్నారు.



