- Advertisement -
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి వాకబు చేసారు. కెసిఆర్ వైద్యం పై ఎప్పటికప్పుడు పరిస్థితి తనకు తెలియచేయాలని ఐఎఎస్ లకు సూచించారు. మేరుగైన వైద్యం అందించాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ కి సూచించారు.
రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు యశోద హాస్పిటల్ కు ఆరోగ్యశాఖ కార్యదర్శి వెళ్లారు. యశోద ఆసుపత్రి వైద్యులను అడిగి కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి అధికారులు గురించి తెలుసుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని హెల్త్ సెక్రటరీ కి యశోద వైద్యులు చెప్పారు. కెసిఆర్ కు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులకు సీఎం సూచించారు.
- Advertisement -