Monday, October 14, 2024

మళ్లీ వస్తున్నా…. మీకోసం….దీవించండి

- Advertisement -

కరీంనగర్ లో పాదయాత్రకు సిద్ధమైన బండి సంజయ్
ఈనెల 7న కరీంనగర్ టౌన్ నుండి పాదయాత్ర షురూ…
ఒకవైపు కరీంనగర్ లో పాదయాత్ర…
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన బండి
హెలికాప్టర్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేయనున్న బండి సంజయ్
8న సిరిసిల్ల, నారాయణపేట నియోజకవర్గాల్లో పర్యటనలతో శ్రీకారం
బుల్లెట్ ప్రూఫ్ కారు భద్రత నడుమ ప్రచారం చేయనున్న బండి సంజయ్
ఈనెల 6న నామినేషన్ వేయనున్న సంజయ్

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అసెంబ్లీ బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ మరోసారి పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఈనెల 7నుండి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర చేయబోతున్నారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం వరకు, ఆ తరువాత సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల వరకు పాదయాత్ర చేస్తారు. తొలిరోజు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోని అంబేద్కర్ నగర్ లోని 24వ డివిజన్ లో పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు.

Coming again….for you….bless
Coming again….for you….bless

ఒకవైపు తన నియోజకవర్గంలో పాదయాత్ర చేయడంతోపాటు మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలతో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారానికి రావాలంటూ పార్టీ నాయకత్వంపై పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తుండటంతో బండి సంజయ్ కు ప్రత్యేకంగా హెలికాప్టర్ కేటాయించింది. ప్రతిరోజు  ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేయాలని కోరింది. మిగిలిన సమయాన్ని తాను పోటీ చేస్తున్న కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి కేటాయించాని సూచించింది.  అందులో భాగంగా 8, 9, 10వ తేదీల్లో ఎక్కడెక్కడ ప్రచారం చేయాలనే అంశంపై షెడ్యూల్ ను రూపొందించింది. తొలిరోజు సిరిసిల్ల, నారాయణపేట, మరుసటి రోజు ఖానాపూర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని బండి సంజయ్ నిర్ణయించారు. దీంతోపాటు బండి సంజయ్ భద్రతను ద్రుష్టిలో ఉంచుకుని ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ కారుకు అనుమతిచ్చింది.

మరోవైపు బండి సంజయ్ కుమార్ ఈనెల 6న బీజేపీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్ధిగా నామినేషన్ వేయనున్నారు. ఆరోజు మంచి ముహూర్తం ఉండటంతో వేద పండితుల సూచనల మేరకు ఆరోజు నామినేషన్ వేయాలని బండి సంజయ్ నిర్ణయించారు. అంతకుముందు ఉదయం 11 గంటలకు కరీంనగర్ లోని కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం నుండి కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరి నామినేషన్ వేయనున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్