కమర్షియల్ వంట గ్యాస్ ధర రూ.39.50 లు తగ్గింపు
న్యూఢిల్లీ డిసెంబర్ 22
సవరించిన గ్యాస్ సిలిండర్ ధరలను గ్యాస్ ఏజెన్సీలు శుక్రవారం ప్రకటించాయి. కమర్షియల్ వంట గ్యాస్ (LPG) ధరలను రూ.39.50 మేర తగ్గించినట్టు వెల్లడించాయి. అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో ధరలకు అనుగుణంగా సవరించినట్టు తెలిపాయి. అయితే గృహ వినియోగ వంటగ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పులేదని గ్యాస్ ఏజెన్సీలు వెల్లడించాయి.కాగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల తగ్గుదలతో హోటల్స్, రెస్టారెంట్ల నిర్వాహకులు స్వల్ప ఉపశమనాన్ని పొందనున్నారు. తాజా తగ్గింపుతో దేశరాజధాని న్యూఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ ధర రూ.1796.50 నుంచి రూ.1757లకు తగ్గింది. ముంబైలో రూ.1,710, కోల్‌కతాలో రూ.1868, చెన్నైలో రూ.1929కి స్వల్పంగా తగ్గాయి. స్థానిక పన్నుల ఆధారంగా రాష్ట్రాలను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయి.
కమర్షియల్ వంట గ్యాస్ ధర రూ.39.50 లు తగ్గింపు
- Advertisement -
- Advertisement -