- Advertisement -
సికింద్రాబాద్
నాంపల్లి రైల్వే స్టేషన్ లో ప్రమాదవశాత్తు ఏక్సిడెంట్ కు గురై గాయాలు పాలైన ఆరుగురు వ్యక్తులను లాలాగుడా లోని రైల్వే ఆసుపత్రికి తరలించారు. ఐదు మంది వ్యక్తులకు సామాన్య గాయాలు కాగా ఒక వ్యక్తికి అధిక గాయాలు అయ్యాయని రైల్వే అధికారులు తెలిపారు. మామూలు గాయాలు అయిన వ్యక్తులకు 50 వేలు రూపాయలు, తీవ్ర గాయాలు అయిన ఒక వ్యక్తికి 2 లక్షల 50 వేలు రూపాయిలు ఇస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. .
- Advertisement -