- Advertisement -
సమగ్ర శిక్ష అభినయన్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చెయ్యాలి
Comprehensive punishment Abhinayan employees should be regularized
సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు రాష్ట్రంలో సుమారు 20వేల కాంట్రాక్టు ఉద్యోగులు గత 17 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరవదిక దీక్షలు చేస్తున్నారు. ఈ సందర్బంగా నిరవదిక దీక్షకు సమాజ్ వాది పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్కల బాబు గౌడ్ సంపూర్ణ మద్దతు ప్రకటించినారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వారి రాజ్యాంగ బద్ద డిమాండ్లను నెరవేర్చి, వారి నిరవదిక దీక్షను వెంటనే విరమింప చేయాలని, అదేవిదంగా,వారు పనిచేస్తున్నసంస్థలనునిర్లక్ష్ యంచేయకుండా,సమగ్రశిక్షాఉద్యోగు లకు పూర్తి వేతనాలు మంజూరు చేస్తూ, వారి సర్వీస్ రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సర్వ శిక్ష అభియాన్ మాధ్యమిక శిక్ష అభియాన్లను, రెండింటిని మిళితం చేసి 2018 లో కేంద్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష అభియాన్ ను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఈ పథకం అమలులో 12వ తరగతి వరకు ప్రజలందరికీ విద్యను అందించాలనే లక్ష్యంగా ఏర్పాటు చేసింది. కాని ఈ పథకం కింద పని చేసే ఉద్యోగులను మాత్రరం గాలికొదిలి వెట్టిచాకిరి చేయించడం సమంజసంకాదు, కావున సమగ్ర శిక్షా ఉద్యోగులకు న్యాయంచేసి కాంగ్రెస్ ప్రభుత్వం వారి హామీని అమలుచేసి, ప్రజాపాలనను రుజువు చేసుకోవాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో సమాజ్ వాది పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ జానంపేట రాములు పాల్గొన్నారు
- Advertisement -