హైదరాబాద్ బరిలో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థి!
హైదరాబాద్, ఏప్రిల్ 15
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీతో అంతర్గత ఒప్పందానికి సిద్ధమైంది. హైదరాబాద్‌లో ఎంఐఎంను ఓడించాలని మొదట పట్టుబట్టిన కాంగ్రెస్ పార్టీ ఇందుకోసం సానియామీర్జ, ఫిరోజ్‌ఖాన్‌తోపాటు మరికొందరి పేర్లను కూడా పరిశీలించింది. కానీ, చివరకు ఓ హిందూ అభ్యర్థిని నిలబెట్టి మజ్లిస్‌కు మేలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. కాంగ్రెస్ అధికారంలో లేనంత వరకు ఆ పార్టీని కించపరిచేలా మాట్లాడిన ఎంఐఎం, ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో హస్తం పార్టీ ఓటమిలో కీలక పాత్ర పోషించింది. కానీ, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇప్పుడు దోస్తీకి సిద్ధమైంది.ఇక హైదరాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓ బీసీ అభ్యర్థిని పెట్టాలని భావిస్తోంది. తద్వారా ఎంఐఎంతో స్నేహపూర్వక బంధాన్ని కొనసాగించాలని ప్రయత్నిస్తోంది. ఎంఐఎం నేతలు కూడా అదే వైఖరి అవలంబిస్తున్నారు. బీఆర్‌ఎస్‌కు క్రమంగా దూరమవుతున్నారు. బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతతో తనకు ఈసారి గట్టి పోటీ ఎదురవుతుందని భావించిన ఎంఐఎం చీఫ్ అసద్.. కాంగ్రెస్ కూడా ముస్లిం అభ్యర్థిని నిలిపితే ముస్లిం ఓట్లు చీలి బీజేపీకి లబ్ధి కలుగుతుందని భావించారు. దీంతో కాంగ్రెస్ తరపున బలహీనమైన అభ్యర్థిని బరిలోకి దించాలని ఒవైసీ విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది.హైదరాబాద్‌తో తన గెలుపునకు కాంగ్రెస్ సహకరిస్తే, రాష్ట్రంలోని 16 లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపునకు తాము సహకరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి, ఎంఐఎం చీఫ్ ఒవైసీ మధ్య అంగీకారం, అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీసీ క్యాండిడేట్‌ను పోటీకి దించేందుకు రెడీ అవుతోంది అధికార కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ బరిలో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థి!మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు బీఆర్‌ఎస్‌తో అంటకాగిన ఎంఐఎం.. ఆ పార్టీ గెలుపు కోసం కృషి చేసింది. ఇప్పుడు అధికారం కోల్పోవడంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పంచన చేరింది. ఎవరు అధికారంలో ఉంటే వారితో దోస్తీ మజ్లిస్ పార్టీకి అలవాటే. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేదని, ఎలాంటి అవగాహన కుదుర్చుకోలేదని మజ్జిస్ అధినేత ఒవైసీ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తాము ఒంటరిగానే పోటీ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. మజ్జిస్ ఏ పార్టీకి బి టీమ్ కాదని స్పష్టం చేసిన ఒవైసీ.. రానున్న ఎన్నికల్లో మజ్జిస్ పార్టీని ప్రజలే గెలిపిస్తారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అసదుద్దీన్ ఒవైసీ శనివారం బహుదూర్‌పురా శాసనసభ నియోజకవర్గ పరిధి ఫలక్‌నుమా ప్రాంతంలో పాదయాత్ర నిర్వహించిన ఒవైసీ.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్‌ఎన్నికల్లో మజ్జిస్ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుందని, అవగాహనతో పోటీ చేస్తుందన్న ఆరోపణలను ఖండించారు.
మరో వైపు త్తరప్రదేశ్‌లోని పీడీఎం కూటమిలో మజ్లిస్ పార్టీ భాగంగా ఉందని అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. తమిళనాడులోని ఏఐఏడీఎంకేతో మజ్లిస్ పొత్తు పెట్టుకుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో బోగస్ ఓట్లు ఉన్నాయన్న బీజేపీ నేతల వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన ఖండించారు. రానున్న ఎన్నికల్లో మెజార్టీ ప్రజలు మజ్లిస్ వైపే ఉంటారన్న ఒవైసీ.. బీజేపీ ఎత్తులను చిత్తు చేస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని దళితులు, బీసీలు, మైనార్టీ ముస్లిం, క్రిస్టియన్ ఓటర్లు ఉన్నారని, వారందరి ఓట్లతోనే తాము ఎన్నికల్లో విజయం సాధిస్తామని స్పష్టం చేశారు. రాజ్యాంగ విరుద్ధమైన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను మోదీ ప్రభుత్వం అమలు చేస్తోందని ఆరోపించారు. సీఏఏ సమానత్వ హక్కుకు విరుద్ధమని, మతం ఆధారంగా రూపొందించారని వివరించారు. పార్లమెంట్ తాను తీవ్రంగా వ్యతిరేకించి బిల్లు ప్రతులను చించివేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఒవైసీ గుర్తు చేశారు.
హైదరాబాద్ బరిలో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థి!
- Advertisement -
- Advertisement -