- Advertisement -
కాంగ్రెస్ నేతలవి పైరవీలే తప్ప పోరాటాలు లేవు: కవిత
Congress leaders are followers and there is no struggle: Kavitha
హైదరాబాద్ జనవరి 31
పదవుల కోసం పైరవీలు తప్ప.. ప్రాజెక్టుల కోసం కాంగ్రెస్ నేతలు పోరాటం చేయలేదని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శలుగుప్పించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సాగునీటి ప్రాజెక్టులపై ‘నీళ్లునిజాలు’ పేరిట జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ నిర్మించిన ప్రాజెక్టులు పనికిరావని దుష్పచారం చేయడం తగదని మండిపడ్డారు. రాజకీయాలకతీతంగా ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని కోరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పోతిరెడ్డి పాడు ద్వారా ఎపికి జలాలు తరలించారని ధ్వజమెత్తారు. ఎపి ప్రభుత్వం అక్రమంగా రాయలసీమ, బనకచర్ల ప్రాజెక్టులను చేపడుతోందని కవిత విమర్శించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మేధావులు, బిఆర్ఎస్ నేతలు, తదితరలు పాల్గొన్నారు.
- Advertisement -