- Advertisement -
స్థానిక సంస్థల ఎన్నికలను ధృష్టి లో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ కొత్త డ్రామా
Congress party is a new drama keeping in mind the elections of local bodies
నర్సంపేట :
గ్రామ సభల్లో ప్రకటించిన ఏ ఒక్క పథకం అధికారికంగా ప్రకటించలేదని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించాడు.శుక్రవారం నర్సంపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెద్ది మాట్లాడుతూ,నియోజకవర్గంలోని 179 గ్రామ పంచాయతీ లకు 6 గ్రామ పంచాయతీల్లో మాత్రమే లబ్ధిదారులను ప్రకటించారని,
మిగతా గ్రామాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదా అని ప్రశ్నించారు.ప్రభుత్వం ప్రకటించిన ప్రొసీడింగులు చూస్తుంటే నవ్వుకునే పరిస్థితి ఏర్పడిందని వ్యాంగంగా మాట్లాడారు. 420 రోజులు దాటినా ఆరు గ్యారంటీలు అమలు కాలేదని, ప్రభుత్వ పనితీరు వల్ల అధికారులు తిట్లు తినే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అభివృద్ధి కుంటుపడడంతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడని పరిస్థితి లేదన్నారు. గతంలో ఎమ్మెల్యే గా గెలిచి తర్వాత ఓడిపోతే గెలిచి ఎమ్మెల్యే పెండింగ్ పనులు పూర్తి చేసి బిల్లులు ఇప్పించే వారని, ఇప్పుడు ఆపరిస్థితి లేదన్నారు. గతంలో తెచ్చిన పనులను పక్కన పెట్టి మీరు తీసుకొచ్చిన పనులకు వెంటనే నిధులు ఎలా మంజూరు అవుతున్నాయని ప్రశ్నించ్చాడు.స్పేషల్ డేవలప్ మెంట్ ఫండ్ ఎస్.డి.ఎఫ్, కింద గతం లో నేను ఎంఎల్ఏ గా జివో 369,384, 452 లద్వారా 53కోట్ల 17 లక్షల నిధులు తీసుకువచ్చానాన్నారు.650 పైచిలుకు పనులకు గాను
360 పైగాపనులు పూర్తి చేశామని,గతంలో తెచ్చిన నిధుల పనుల పురోగతిలో ఉన్నా రిటర్న్ చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.గతంలో ఉన్నటువంటి ప్రొసీడింగ్ పనులు పురోగతి ఉన్నప్పటికి, కొత్తగా నిధులు కేటాయించి ప్రొసీడింగులు తెచ్చుకున్నారని విమర్శించాడు.గతంలో పనిచేసిన కంట్రాక్టరు పరిస్థితి ఎంటిని,వారికి కుటుంబాలు లేవా అన్నాడు.గతంలో పనిచేసిన 70 శాతం పనులకు మళ్ళి నూతనంగా 10 కోట్ల నిధులు మంజూరు చేసి ప్రోసిడింగ్ ఎలా తెచ్చారని అన్నారు.గతం లో ఎప్పుడైన ఒకరిపై మరొకరు విమర్శలు, అభివృద్ధి పనులను అడ్డుకునే సంస్కృతి ఉందాని ప్రశ్నించ్చాడు.పార్టీలకతీతంగా గతం లో మీ పార్టీ నాయకులకు కాంట్రాక్టు పనులు ఇవ్వలేదా అన్నాడు.ఆర్నెల్ల ముందు మంజూరైన పనులకు పురోగతి లేదని,15రోజుల్లో పెట్టిన పనులకు మంజూరు ఎలా వచ్చిందని ప్రశ్నించ్చాడు.బాధ్యత గా వ్యవహరించని అధికారులకు ఇబ్బందులు తప్పవన్నాడు.వ్యవసాయ యాంత్రికరణ కోసం తెచ్చిన 60 కోట్ల రూపాయల నిధులను ల్యాప్స్ చేసి, రాష్ట్ర వ్యాప్తంగా ఆవే నిధులతో టెండర్లు పిలవడం విడ్డురంగా ఉండదాన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్.ఎస్.ఎస్,రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి, జిల్లా నాయకులు డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి, బి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు గోనే యువరాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి వేనుముద్దల శ్రీధర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్స్ మండల శ్రీనివాస్, బండి రమేష్, పెండెం వెంకటేశ్వర్లు,గంప రాజేశ్వర్, పట్టణ ఉపాధ్యక్షులు పెండ్యాల యాదగిరి, పట్టణ యూత్ ఉపాధ్యక్షులు పైసా ప్రవీణ్ పట్టణ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -