దస్తగిరమ్మ కుటుంబానికి వైసిపి పది లక్షల రూపాయల సహాయం
Dastagiramma's family is assisted by YCP ten lakh rupees
సహాయాన్ని చెక్కు రూపంలో అందించిన ఎమ్మెల్సీ గోవిందరెడ్డి
బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధ
బద్వేలు
కడప జిల్లా బద్వేల్ లో గత నెల 19వ తేదీన యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇంటర్ విద్యార్థి దస్తగిరమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఆ విషయం తెలిసిన వెంటనే ఎంపీ అవినాష్ రెడ్డి గారు,ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి , ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ కలిసి వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించారు అలాగే వారు మాట్లాడుతూ మా పార్టీ అధ్యక్షులు సీఎం జగన్మోహన్ రెడ్డి గదృష్టికి తెలియజేస్తామని చెప్పారు తెలియజేసిన వెంటనే 23వ తేదీన బద్వేల్ కు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రేమోన్మాది చేతిలో అతి దారుణంగా దస్తగిరిమ్మ అనే యువతి మరణించడం జరిగింది ఈ మరణించిన దస్తగిరిమ్మ కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి పరామర్శించి ఆ కుటుంబానికి పార్టీ తరపున అండగా ఉంటామని 10 లక్షలు సహాయం ప్రకటించడం జరిగింది అలాగే ఇచ్చిన మాట ప్రకారం బుధవారం పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ డీసీ గోవింద రెడ్డి , ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ మరణించిన దస్తగిరిమ్మ ఇంటి దగ్గరికి వెళ్లి 10 లక్షల రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులు అందజేయడం జరిగింది. అలాగే ఈ కుటుంబానికి ఎలాంటి సమస్య వచ్చినా పార్టీ అన్ని విధాలుగా సహాయపడుతుందని తెలియజేశారు అలాగే ఎమ్మెల్సీ డిసి గోవింద రెడ్డి ఎమ్మెల్యే సుధమ్మ మాట్లాడుతూ*
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలకు రక్షణ లేకుండా పోయింది. సహన శరీరంపై గాయాలున్నాయి. బయటకు చెప్పుకోలేని అభద్రతాభావంలో సహన తల్లిదండ్రులు ఉన్నారు. మహిళలకు రక్షణ లేదన్న భావన వ్యక్తం అవుతోంది. సహన ఘటనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. దిశ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి మహిళలకు రక్షణ కల్పించింది వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అలాంటి చట్టాన్ని నీరుగార్చి కూటమి ప్రభుత్వం మహిళల భద్రతను గాలికొదిలేసింది. దిశ లాంటి చట్టాలను తక్షణమే అమల్లోకి తీసుకురావాలి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మేం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
*కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ రాష్ట్రదూదేకుల కమ్యూనిటీని అధ్యక్షుడు రసూల్ నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమన్వయకర్త రమణారెడ్డి మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, మాజీ కూడా చైర్మన్ సింగసాని గురు మోహన్, నియోజకవర్గం ప్రజాప్రతినిధులు మండల నాయకులు కౌన్సిలర్లు, మాజీడైరెక్టర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్, పలు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు