Saturday, February 15, 2025

జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో  ఘనంగా సాయుధ బలగాల డీ-మొబిలైజేషన్ పరేడ్

- Advertisement -

జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో  ఘనంగా సాయుధ బలగాల డీ-మొబిలైజేషన్ పరేడ్

De-mobilization parade of heavily armed forces at District Police Headquarters

ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

భద్రాద్రి

హేమచంద్రాపురం నందు గల జిల్లా పోలీసు హెడ్క్వార్టర్స్ లో 15 రోజుల పాటు సాగిన జిల్లా అర్మడ్ రిజర్వ్ సిబ్బంది మొబిలైజేషన్ ముగింపు కార్యక్రమంలో జిల్లాఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ముందుగా జిల్లా అర్మడ్ సిబ్బంది నుండి ఎస్పీ గౌరవ వందనాన్ని స్వీకరించారు.05 ప్లటూన్లతో ఏర్పాటు చేసిన ఈ పరేడ్ నకు అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు ప్లటూన్ కమాండెర్ గా వ్యవహరించారు.పదిహేను రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ఇండోర్,ఔట్డోర్,ఫైరింగ్ ప్రాక్టీస్ లలో సిబ్బంది అంతా ఉత్సాహంగా పాల్గొన్నారని ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ ఎస్పీకి వివరించారు.అనంతరం ఎస్పీ  మట్లాడుతూ పోలీసుశాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ కలిగి ఉండాలని,భాద్యతగా తమ విధులను నిర్వర్తిస్తూ ప్రజలకు సేవలందించాలని సూచించారు.ఈ మొబిలైజేషన్ కార్యక్రమం ద్వారా శారీరక దృడత్వంతో పాటు మానసిక ఉల్లాసం కూడా లభిస్తుందని అన్నారు.అద్బుతంగా చేసిన పరేడ్ ను చూస్తే తమ శిక్షణ రోజులు గుర్తొస్తున్నాయని  తెలిపారు.అనంతరం అక్కడ పాల్గొన్న అధికారులు,సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు.వెంటనే అట్టి సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపడతామని తెలియజేశారు.నిరంతరం విధులలో ఉండే పోలీసు అధికారులు,సిబ్బందికి వ్యక్తిగత,కుటుంబపరమైన,శాఖాపరమైన సమస్యలను పరిష్కరించేందుకు  ఎల్లపుడూ ముందుంటామని వివరించారు.ఈ డీ-మొబిలైజేషన్ పరేడ్ కార్యక్రమాన్ని సుందరంగా ఏర్పాటుచేసిన అధికారులను అభినందించారు.

పోలీస్ శాఖలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి మెడల్స్ అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

పోలీసు శాఖలో పనిచేస్తూ విశిష్ట సేవలందించిన పోలీస్ అధికారులు సిబ్బందికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జిల్లాకు చెందిన 260 మందికి శుక్రవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ మెడల్స్ ను అందజేశారు.పోలీసు శాఖలో వారి సేవలకు గాను విభాగాల వారీగా కఠిన సేవా,ఉత్తమ సేవా,సేవా పతకాలతో పాటు యాంత్రిక్ సురక్షా సేవా పతకాలను జిల్లా పోలీస్ హెడ్క్వార్టర్స్ పేరెడ్ మైదానం నందు అందించడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ క్రమశిక్షణ,నిబద్ధతతో పనిచేసే పోలీసు అధికారులు,సిబ్బందికి ఎప్పటికైనా గుర్తింపు లభిస్తుందని అన్నారు.ప్రజలకు ప్రత్యక్షంగా సేవలు అందించడంలో పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు.ఈ పతకాలు సాధించిన వారికి ఈ సందర్బంగా అభినందనలు తెలిపారు.ప్రజలలో పోలీస్ శాఖపై నమ్మకాన్ని మరింత పెంచే విధంగా పోలీసు అధికారులు,సిబ్బంది భాద్యతగా పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ,ఎస్బీ సిఐలు నాగరాజు,శ్రీనివాస్ అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు,హోంగార్డ్స్ ఆర్ఐ నరసింహారావు,ఎంటిఓ సుధాకర్,వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు, ఇతర అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్