- Advertisement -
చిన్నారి మృతి
Death of a child
టీకా వికటించిందని బంధువుల ఆరోపణ
సిరిసిల్ల
రాజన్నసిరిసిల్ల జిల్లా నేరెళ్ళ గ్రామానికి చెందిన లలిత – రమేష్ దంపతుల 45 రోజుల వయసుగల కూతురుకు నేరెళ్ళ పీహెచ్సీలో టీకా వేయించారు. అయితే ఇంటికి వెళ్ళాక పాప అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో తిరిగి ఆసుపత్రికి తీసుకరాగా అప్పటికే పాప మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. వైద్యుల నిర్లక్ష్యమే పాప మృతికి కారణమని ఆరోపిస్తూ కుటుంబసభ్యులు ధర్నాకు దిగారు.
- Advertisement -



