సింగరేణి వారసులు అరిగొస పెడుతున్నా రెవంత్ రెడ్డి సర్కార్…
Descendants of Singareni are complaining, Revanth Reddy Sarkar...
మగుండం మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్.
ఖని.
మారుపేర్లు, విజిలేన్స్ ఎంక్వరి పేర సింగరేణి కార్మికుల వారసులను ఉద్యోగాలు కల్పించకుండా రెవంత్ రెడ్డి సర్కార్ సింగరేణి యాజమాన్యం అరిగొస పెడుతుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్
అగ్రహం వ్యక్తం చేశారు.
సింగరేణి కారుణ్య నియామకాల్లో డిపెండెంట్ ఉద్యోగ బాధితులకు మారుపేర్లు విజిలెన్స్ పెండింగ్ సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ గోలెట్ నుండి కొత్తగూడెం కు పాదయాత్రకు గోదావరిఖని మున్సిపల్ చౌరస్త వద్ద మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సింగరేణి ప్రారంభం లో సంస్దలో పనిచేయాడాని భయపడేవారని … ఎవ్వరు కుడా అనాడు గనిలో పనికి వేళ్లినా వారు తిరిగి ప్రాణాలతో బయటకు వస్తరన్నా ఆశలేకుండా ఉండేదన్నారు. సింగరేణి యాజమాన్యం 30 సంవత్సరాల క్రితం నిరాక్షరాస్యులుగా ఉన్న వారిని మారుపేర్లతో సింగరేణి యాజమాన్యం విధులోకి తీసుకున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ టిడిపి హాయంలో కాలరాసీనా సింగరేణి వారసత్వ ఉద్యోగాలను తిరిగి పునరుద్ధరించి కారుణ్య నియమకా పెరుతో కార్మికుల వారసుల ఉద్యోగాలు కల్పించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు.
తొలి సిఎం కేసీఆర్ సింగరేణి సంస్దలో పని చేస్తున్న కార్మికుల సంబంధించిన మారుపేర్ల విషయంలో సింగరేణి సంస్ధ ఈ సమస్యను పరిష్కారం చేయాలని సర్యూలర్ జారి చేసిందని చెప్పారు. గత ఎన్నికల ప్రచారం నేటి ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి కోల్ ప్రాంతంలోని 15 మంది ఎమ్మెల్యే లను గెలిపిస్తే సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తామని వారసులకు మారుపేర్లు విజిలెన్స్ ఎంక్వేరీలు లేకుండా 10 రోజుల్లో పరిష్కారం చేస్తామని మాట ఇచ్చి సంవత్సర కాలం గడుసున్న ఈ సమస్య పరిష్కారం చేయాలేదన్నారు. రెవంత్ రెడ్డి మాటాలు నమ్మి కాంగ్రెస్ పార్టీ ని ఎమ్మెల్యేలను గెలిస్తే కారుణ్యనియామాకాల బాధితులు అనేక ఇబ్బందులు పడుతున్నరన్నారు. వారసత్వం ఉద్యోగరాక శ్రీధర్ చనిపోతే ఈ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లు మాట్లాడాటంలేదన్నారు. సమస్య పరిష్కారం కోసం గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం సర్క్యలర్ ఇచ్చిన అనేక రకాల కొర్రిలు పెడుతూ కార్మకుల వారసులను కాంగ్రెస్ సింగరేణి యాజమాన్యం అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. వెంటనే మారుపేర్ల సమస్యను పరిష్కారం చేయాలని బి.ఆర్.ఎస్ పార్టీ పక్షాన ఆయన డిమాండ్ చేశారు. రాబోవు కాలంలో కాంగ్రెస్ పార్టికి సింగరేణి కార్మికులు తగిన గుణపాఠం చేబుతారన్నారు. ఈ కార్యక్రమం లో నాయకులు అచ్చే వేణు నారాయణదాసు మారుతి కౌటం బాబు కుడుదుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.