- Advertisement -
నూతనంగా నిర్మిస్తున్న పెట్రోల్ పంపును సందర్శించిన డీఐజీ వెల్పేర్
DIG Welfare visited the newly constructed petrol pump
సిద్దిపేట
డిఐజి డాక్టర్. గజరావు భూపాల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ తో కలిసి పొన్నాల గ్రామ శివారు పోలీస్ కన్వెన్షన్ సెంటర్ ఎదురుగా నూతనంగా నిర్మిస్తున్న పెట్రోల్ పంపును, పోలీస్ కన్వెన్షన్ సెంటర్ ను పోలీస్ కమిషనర్ కార్యాలయాన్ని కార్యాలయంలో ఉన్న స్పెషల్ బ్రాంచ్, సిసిఆర్బి, కమాండ్ కంట్రోల్ రూమ్, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా డిఐజి వెల్ఫేర్ మాట్లాడుతూ పోలీస్ కన్వెన్షన్ సెంటర్, ఎదురుగా విశాలమైన పార్కింగ్ తో అద్భుతంగా నిర్మించడం జరిగిందని, సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయం
పచ్చదనం పరిశుభ్రతతో చాలా బాగుందని అభినందించారు. పోలీస్ కన్వెన్షన్ సెంటర్ మెయింటెనెన్స్ బాగుందని అధికారులను అభినందించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ త్వరలో పోలీస్ పెట్రోల్ పంపు ప్రజలకు అందుబాటులోనికి తీసుకొని వస్తామని ఉన్నతాధికారులతో కలిసి ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ధరణి కుమార్, విష్ణు ప్రసాద్, త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్, సీసీ నితిన్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -