Thursday, February 19, 2026

కేవలం గంట వ్యవధిలోనే ఇద్దరు పిల్లలను సురక్షితంగా తల్లికి అప్పగించిన దిశా పోలీసులు…

- Advertisement -

ఇద్దరు పిల్లలు కనిపించడం లేదని దిశ యాప్ కు కాల్ చేసిన తల్లిదండ్రులు…
భిక్షాటన చేసే వారు ఎత్తుకెళ్లారని అనుమానం వ్యక్తం చేసిన తల్లి…
నాలుగు నిమిషాల్లోనే సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించిన దిశా పోలీసులు…
అమ్మ కొట్టిందని భయంతో ఇంటి నుండి పారిపోయినట్లు తెలిపిన ఇద్దరు పిల్లలు…
ఇద్దరు పిల్లలకు, తల్లికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించిన దిశ పోలీసులు…

కాకినాడ: అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఓ మహిళ తన కొడుకు, కూతురు కనిపించడం లేదని దిశ యాప్ కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన సెప్టెంబర్ 9వ తేదీ రాత్రి పది గంటల ప్రాంతంలో జరిగింది. బాధిత మహిళ నుండి కాల్ వచ్చిన నాలుగు నిముషాల వ్యవధిలోనే సంఘటనా స్థలానికి దిశ పోలీసులు చేరుకున్నారు. ఫిర్యాదు దారు మరియమ్మ ఇచ్చిన వివరాలను పోలీసులు నమోదు చేశారు. 13 సంవత్సరాల వయసున్న కొడుకు, 14 సంవత్సరాల వయసున్న కూతురు కనిపించడం లేదని తల్లి మరియమ్మ దిశ పోలీసులకు తెలిపింది. అదేవిధంగా కాకినాడ లోని రేచిల్లపేటలో ఉండే మహిళా యాచకురాలు తన ఇద్దరు పిల్లలను తీసుకెళ్లినట్టు మరియమ్మ అనుమానం వ్యక్తం చేసింది. బాధిత మహిళ ఇచ్చిన వివరాల ప్రకారం దిశ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మహిళా యాచకురాలు ఉన్న లొకేషన్ కు ఒక బృందం వెళ్లి పిల్లల కోసం వెతకడం జరిగింది. ఆ ప్రదేశానికి పిల్లలు ఎవరు రాలేదని పోలీసుల విచారణలో స్పష్టం అయింది.

Disha police handed over the two children safely to their mother within an hour.
Disha police handed over the two children safely to their mother within an hour.

అదేవిధంగా మరొక బృందం బాధితురాలు ఉంటున్న ప్రదేశం లోని చుట్టుపక్కల ప్రాంతాల్లో పిల్లల కోసం అన్వేషణ చేపట్టారు. ఒక నిర్మాణస్యమైన ప్రదేశంలో ఇద్దరు పిల్లలు కూడా బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ కనిపించారు. వెంటనే దిశ పోలీసులు ఇద్దరు పిల్లలను తీసుకెళ్ళి సురక్షితంగా తల్లికి అప్పగించారు. కేవలం గంట వ్యవధిలోనే తప్పిపోయిన ఇద్దరు మైనర్ పిల్లలను కనిపెట్టడం తో పాటు, సురక్షితంగా తల్లికి అప్పగించారు దిశా పోలీసులు.  ఇంట్లో తల్లి మందలించిందని అలిగి వెళ్లిపోయినట్టు ఇద్దరు పిల్లలు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తల్లితో పాటు ఇద్దరు పిల్లలకు కూడా దిశా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. తన ఇద్దరు పిల్లలు మిస్సింగ్ అయిన వెంటనే తీవ్ర భయాందోళనకు గురైనట్లు మరియమ్మ తెలిపింది. దిశ పోలీసులను సంప్రదిస్తే తప్పకుండా కనిపెడతారనే నమ్మకంతో కాల్ చేసినట్టు బాధిత మహిళ మరియమ్మ పేర్కొంది. తన నమ్మకం ప్రకారమే మిస్సింగ్ అయిన గంట వ్యవధిలోనే దిశ పోలీసుల సురక్షితంగా తన ఇద్దరు పిల్లలను అప్పగించారని మరియమ్మ సంతోషం వ్యక్తం చేసింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్