Thursday, January 16, 2025

వావర్ మజీద్ కు వెళ్లవద్దు

- Advertisement -

వావర్ మజీద్ కు వెళ్లవద్దు

Do not go to Wawar Majeed

ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్
శబరిమల వెళ్లే మార్గంలో ఉన్న వావర్ మజీద్ కు అయ్యప్ప స్వాములు వెళ్లకూడదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. అయ్యప్పలు నిష్ఠగా మాల వేసి 41 రోజులు దీక్ష చేసి , సమాధి ఉన్న మజీద్ లోకి వెళ్తే అపచారం అని ఆయన అన్నారు. గతంలో తప్పకుండా వావర్ మజీద్ కు వెళ్లాలని తప్పుడు ప్రచారం చేశారని… అది కుట్రలో భాగం అని ఆయన అన్నారు. అయ్యప్పలు నేరుగా శబరిమల వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలని  రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. భాగ్యనగర్ అయ్యప్ప సేవ సమితి (బాస్)
శబరిమల లోని నీలక్కల్ వద్ద ఈ నెల 7 నుండి 14 వరకు అయ్యప్ప స్వాములకు ఏర్పాటు చేయబోయే అన్నదానం సామగ్రి లారీని రాజాసింగ్ హైదరాబాద్ లో జెండా ఊపి ప్రారంభించారు. 16 ఏళ్లుగా బాస్ సంస్థ అన్నదానం చేయడం అభినందనీయం అని అన్నారు. ఏపీ , తెలంగాణ ముఖ్యమంత్రులను రాజాసింగ్ ఒక విజ్ఞప్తి చేశారు. కేరళ ప్రభుత్వం తో మాట్లాడి , అక్కడ 10 ఎకరాల భూమిని తీసుకొని , శబరిమల వెళ్లే తెలుగు రాష్ట్రల అయ్యప్ప స్వాముల కోసం అక్కడ వసతి , భోజన సౌకర్యం కల్పించాలని రాజాసింగ్ కోరారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్