- Advertisement -
కృష్ణకుమారికు డాక్టరేట్ అవార్డు…
Doctorate award to Krishnakumari...
డుంబ్రిగుడ
మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వర్తిస్తున్న కమ్మిడి. కృష్ణ కుమారి కు చేయూత సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ వారు విశాఖపట్నంలో డాక్టరేట్ అవార్డు అందించారు. కరోనా సమయంలో కూడా కృష్ణకుమారి ఆమె ప్రాణాలకు లెక్కచేయకుండా ఇతరుల కోసం సేవ చేయాలనే బలమైన సంకల్పంతో కాలినడకతో అనేక మారుమూల గ్రామాల్లో కరోనాకాలంలో అనేకమంది నిరుపేద గిరిజనులు ఆర్థికంగా పలు ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆమె ముందుకు వచ్చి అనేక సేవలు అందించారు. అలాగే సిఆర్టిగా విధులు నిర్వర్తిస్తూ చాలీచాలని వేతనాలతో ఆమె ఉన్నప్పటికి కూడా అందులో ఎంతో కొంత పేద కుటుంబాల కోసం ఖర్చు పెట్టడం ఆమె గొప్పతనం. వన్య ప్రాంతంలో అనేక సేవలు అందించిన కృష్ణకుమారి అభినందనలు తెలుపుతూ ఆమె చేసిన సేవలను గుర్తించి డాక్టర్ రెడ్ అవార్డు ఇవ్వడం జరిగిందని చేయూత సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ వారు తెలిపారు.
- Advertisement -