1.4 C
New York
Monday, February 26, 2024

బి.ఆర్.ఎస్ మాయ మాటలు నమ్మి మోసపోవద్దు మాజీ మంత్రి కొండా సురేఖ

- Advertisement -

బి.ఆర్.ఎస్ మాయ మాటలు నమ్మి మోసపోవద్దు.

వాయిస్ టుడే వరంగల్ జిల్లా బ్యూరో

మాజీ మంత్రి శ్రీమతి కొండా సురేఖ

.

గురువారం వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని 35 వ డివిజన్లో గడపగడపకు సురేఖమ్మ అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి గడపగడపకు తిరుగుతు ప్రజలకు సోనియాగాంధీ ప్రకటంచిన ఆరు గ్యారంటీ పథకాలను ఇంటి ఇంటి ప్రచారంలో వివరించటానికి మాజీ మంత్రి శ్రీమతి కొండా సురేఖ ఈ కింద ఉన్న కాలనీలలో పర్యటించారు. ఇందిరమ్మ విగ్రహం అంబేద్కర్ కమ్యూనిటీ హాల్. నాలుగు జెండాలు,SC కాలని,ఏ. సి.రెడ్డి నగర్, వరంగల్ రైల్వే స్టేషన్ మూడవ ప్లాట్ ఫామ్ వైపు ఉన్న అన్ని కాలనీలలో గడపగడపకు తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను ఇంటింటి ప్రచారంలో వివరించిన కొండా సురేఖ.ఈ సందర్బంగా కొండా సురేఖ మాట్లాడుతూస్థానిక ఎమ్మెల్యేకు వరంగల్ ప్రజలను ఓట్లు అడిగే కనీస అర్హత లేదన్నారు, నియోజకవర్గంలో బిఆర్ఎస్ అభ్యర్తి ఏమి అభివృద్ది చేశారో చెప్పాలన్నారు, చేసిన అభివృద్దిని చూపించమని అడిగిన ప్రతీసారి సమాదానం చెప్పలేక దాడులకు దిగుతున్నారని విమర్శించారు, రౌడీయిజం, గూండాగిరితో అధికారంలోకి వస్తామని అనుకోవడం అవివేకమని తెలిపారు, నియోజకవర్గ ప్రజలు ఆ పార్టీల పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారన్నారు, అధికారం, హంగూ ఆర్భాటాలే తప్ప సామాన్య ప్రజలకు చేసిందేమిలేదన్నారు, బి.ఆర్.ఎస్, అసమర్ధ పాలన వల్లే నియోజకవర్గం ఈ రోజు ఇంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందన్నారు, నిరుద్యోగం పెరిగి జీవనోపాది లేక యువత ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు,ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేకపోయారని, డ్రైనేజీ వ్యవస్థ అద్వాన్నంగా తయారయ్యిందన్నారు,డబుల్ బెడ్ రూం ఇండ్లు, దళిత బందు, బిసి బందు వంటి అనేక పథకాలను కేవలం బిఆర్ఎస్ కార్యకర్తలకు, అనుచరులకు మాత్రమే కేటాయించారని తెలిపారు, వరంగల్ నగరం ఎప్పటినుండో చిన్న వర్షాలకే ముంపుకు గురవుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా శాశ్వత పరిష్కారం చూపలేకపోయారన్నారు, వరదల సమయంలో మాత్రమే హడావిడి చేయటం ఆతరువాత ఆ సమస్యను పట్టించుకోలేదని అన్నారు, ఇప్పుడు ఏమొకం పెట్టుకొని టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల బరిలోకి వచ్చారని ప్రశ్నించారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలతో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ జోరులో ఉందని అధికారంలోకి రావడం ఖాయం అయిందన్నారు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పే దొంగ మాటలకు మోసపూరితకు హామీలకు లొంగకుండా ధైర్యంగా వరంగల్ తూర్పు నియోజకవర్గం కొండ సురేఖ చేతి గుర్తుకు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తామని కొండా సురేఖ కొనియడడం జరిగింది, మీకు ఎలాంటి ఆపద సమయంలోనైనా ఎల్లవేళలా కొండా దంపతుల ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని కార్యకర్తలే మా కుటుంబ సభ్యులని వరంగల్ తూర్పు నియోజకవర్గమే మా కుటుంబం అని కొండా సురేఖ చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, అన్ని డివిజన్ల అధ్యక్షులు, కాంటెస్ట్ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు, కార్యకర్తలు, కొండా అభిమానులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!