3 రోజులు మందు షాపులు బంద్
హైదరాబాద్, మే 9,
రాష్ట్రంలో ఈ నెలలో ఎన్నికల సందర్భంగా మూడు రోజులపాటు వైన్స్ షాపులు మూసివేయనున్నారు. ఈ నెల 11, 12, 13వ తేదీల్లో వైన్స్ షాప్‌లు బంద్ చేయనున్నారు. మే 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం వరకు ఈ మందు దుకాణాలు మూసే ఉంటాయి. మన రాష్ట్రంలో 13వ తేదీన పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. పోలింగ్ తేదీకి ముందు రెండు రోజుల పాటు ప్రచారం ముగుస్తుంది. ప్రలోభాల పర్వం అసలే జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటారు. ఇందులో భాగంగా వైన్స్ షాపులు బంద్ చేయనున్నారు. పోలింగ్ తేదీతోపాటు కౌంటింగ్ రోజున కూడా వైన్స్ షాప్‌లు మూసివేయనున్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడనున్నాయి. కాబట్టి, 4వ తేదీన ఉదయం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు వైన్స్ షాప్‌లు బంద్ కానున్నాయి. ఈ తేదీల్లో రాష్ట్రంలోని అన్ని వైన్స్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్‌లు మూసివేస్తారు.సార్వత్రిక ఎన్నికలు ఏడు విడతల్లో జరుగుతున్నాయి. ఇందులో తెలంగాణలో నాలుగో విడతలో పోలింగ్ జరగనుంది. తెలంగాణలో 17 లోక్ సభ ఎన్నికలకు, ఏపీలోని 25 లోక్ సభ స్థానాలకు అలాగే 175 అసెంబ్లీ స్థానాలకు నాలుగో విడతలో భాగంగా ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరుగుతుంది. అన్ని విడతల పోలింగ్ ముగిశాక ఓట్ల లెక్కింపు జూన్ 4వ తేదీన నిర్వహిస్తారు.