Tuesday, May 19, 2026

తగ్గుతున్న అగ్రవర్ణాల జనాభా

- Advertisement -

తగ్గుతున్న అగ్రవర్ణాల జనాభా

Dwindling upper caste population

గిరిజనుల కంటే ముస్లింలు ఎక్కువ
హైదరాబాద్, ఫిబ్రవరి 4, (వాయిస్ టుడే)
అగ్రవర్ణాలు అంటే.. తెలంగాణలో వెలమ, రెడ్లు, బ్రాహ్మణులు, క్షత్రియులు, తదితర కులాలను భావిస్తారు. తెలంగాణలో వెలమ, రెడ్డి, బ్రాహ్మణ సామాజికవర్గం వారే అగ్రవర్ణాలుగా పనిగణింపబడుతున్నారు. ఒకప్పుడు తెలంగాణలో వీరిదే పెత్తనం. దొర, పటేల్ పేర్లతో బీసీలు, దళితులతో పిలిపించుకున్నారు. భూములు వారి చేతుల్లోనే ఉండేవి. అయితే తర్వాత జరిగిన పరిణామాలు, భూపరిధి చట్టం, చదువు అందరికీ అందుబాటులోకి రావడంతో మిగతా సామాజికవర్గాలు కూడా ఎదుగుతున్నాయి. రిజర్వేషన్ల ఫలితంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అయితే దశాబ్దాలుగా కుల గణన చేపట్టకపోవడంతో రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటి నుంచి ఉన్న రిజర్వేషన్లే 75 ఏళ్లుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ కుల గణన చేసి వాటి ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. ఈ క్రమంలో ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలకు ముందే తాము అధికారంలోకి వస్తే కుల గణన చేస్తామని హామీ ఇచ్చింది. ఈమేరకు 2024లో కుల గణన చేపట్టింది. దానికి సబంధించిన నివేదికను ప్రభుత్వం ఆదివారం(ఫిబ్రవరి 2న) విడుదల చేసింది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.కుల గణన నివేదిక ప్రకారం రాష్ట్ర జనాభాలో బీసీలు 46.25 శాతం ఉన్నారు. అంటే 1.24 కోట్ల మంది బీసీలు ఉన్నారు. ఆ తర్వాత అగ్రవర్ణాలు అంటే ఓసీలు 18 శాతం ఉన్నారు. అయితే వీరిలో ఓసీ ముస్లింలు 2.5 శాతం ఉన్నారు. వీరిని తీసేస్తే హిందూ అగ్రవర్ణాలు 15.79 శాతం మాత్రమే. ఇదే సమయంలో ఎస్సీలు 17.43 శాతం ఉన్నారు. అంటే 61,84,319 మంది ఉన్నారు. ఎస్టీలు 37,05,929 మంది ఉన్నారు. మొత్తం జనాభాలో ఎస్టీ జనాభా శాతం 10.45 గా ఉంది.ఇక తెలంగాణలో ముస్లిం జనాభా భారీగా ఉంది. 44,57,012 మంది ఓసీలు ఉన్నారు. మొత్తం జనాభాలో 12.56 శాతంగా ఉంది. అంటే గిరిజన జనాభాకన్నా ముస్లిం జనాభా పెరిగింది. ఇక బీసీ ముస్లింలను విడిగా లెక్కించారు. వారి సంఖ్య 35,76,588 గా తేలింది. మొత్త జనాభాలో 10.08 శాతంగా ఉన్నారు. మొత్తంగా 96,9 శాతం జనాభాను సర్వే చేశామని, 3,54,77,554 మంది వ్యక్తుల వివరాలు తీసుకున్నామని ప్రభుత్వం ప్రకటించింది. లక్ష ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయని తెలిపారు. మరో 1.68 లక్షల మంది తమ వివరాలు ఇవ్వడానికి నిరాకరించారని తెలిపింది.రాష్ట్రంలో ప్రజలకు సామాజిక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందించడం వలన, బడుగు బలహీన వర్గాల జనాభా పెరిగింది. అగ్రవర్ణ కుటుంబాలు పెద్దగా పట్టు కట్టిన ప్రాంతాల కంటే, వార్షిక ఆదాయం ఎక్కువగా ఉండే, పట్టణాల వైపు వెళ్లడం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వారి జనాభా తగ్గింది. ఈ విధంగా, అగ్రవర్ణ జనాభా తగ్గడం వారి సంఖ్యలో తగ్గుదల మాత్రమే కాకుండా, సమాజంలో సామాజిక, ఆర్థిక మార్పుల సంకేతాలుగా భావించవచ్చు.
52 నుంచి 46 శాతానికి తగ్గారా..
తెలంగాణలో ఏ లెక్కన చూసినా 50-52 శాతం బీసీలు ఉన్నట్లు తెలుస్తోందని… కానీ ప్రభుత్వం 46.25 శాతంగా ఉన్నట్లు తేల్చడం బాధాకరమన్నారు. సకల జనుల సర్వేకు, ఇప్పటి సర్వేకు 21 లక్షల బీసీ జనాభా తేడా కనిపిస్తోందన్నారు. కేవలం ఓసీల జనాభా పెరిగి BC, SC, ST జనాభా తగ్గుతుందా? అని ప్రశ్నించారు.కులగణన సర్వేలో బీసీల జనాభా తగ్గడంపై బీసీ మేధావుల ఫోరం సైతం పలు ప్రశ్నలు లేవనెత్తింది. 2014 సమగ్ర సర్వేలో బీసీల జనాభా 1.85 కోట్లు అంటే 51 శాతం ఉంటే.. ఇప్పుడు 1.64 కోట్లు అంటే 46.25 శాతం మాత్రమే ఉందని ఫోరం నేతలు అన్నారు. BC, SC, ST, ముస్లింల జనాభా 25.98 లక్షలు తగ్గిందని అదే సమయంలో ఓసీల జనాభా 15.89 లక్షలు పెరిగిందన్నారు. ఇది ఎలా సాధ్యమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. EWS ప్రయోజనాలను కాపాడేందుకు ఇలా చేశారని ఆరోపిస్తున్నారు.సర్కార్ ప్రకటించిన కులగణన లెక్కలు తప్పుల తడక అని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. గత ప్రభుత్వ హయంలో చేసిన సర్వేలో 52 శాతం బీసులు ఉంటే.. ఇప్పుడు 46 శాతానికి ఎలా తగ్గారని ప్రశ్నించారు. బీసీ జనాభా తగ్గి ఓసీల జనాభా ఎలా పెరిగిందో చెప్పాలన్నారు. బీసీ సామాజిక వర్గ ప్రజల పొట్ట కొట్టడానికే తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని మండిపడ్డారు. EWS రిజర్వేషన్లు కాపాడేందుకు బీసీలకు అన్యాయం చేస్తున్నారని.. ఈ లెక్కలను మళ్లీ రివ్యూ చేయాలని ఆయన ప్రభుత్వా్న్ని డిమాండ్ చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్