Tuesday, March 3, 2026

బయటపడుతున్న బీఆర్ఎస్ వైఫల్యాలు

- Advertisement -

బయటపడుతున్న బీఆర్ఎస్ వైఫల్యాలు
హుస్నాబాద్

Emerging BRS failures

ములకనురు లో రైతు అవగాహన సమావేశం లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు బాగుండద్దు తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం ఏమైనా చేస్తే బిఆరెస్ నేతలకు కళ్ళ మంట లాగ కనిపిస్తుంది. ముఖ్యమంత్రి  స్వయంగా వ్యక్తిగత పర్యటన కాదు..అధికారిక పర్యటన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ తో పాటు ఫైనాన్స్ సెక్రటరీ, ఐటీ పరిశ్రమలకు సంబంధించిన అధికారులతో పాటుగా అమెరికా వెళ్లి డెలిగేశన్స్ నీ కలుస్తున్నారు.
రాష్ట్రం ఎక్కడ బాగుపడుతుందో అని కల్ల మంటతో అనేకమైన ఆరోపణలు చేస్తున్నారు.
మేము సవాలు చేస్తున్నాం. 10 సంవత్సరాలుగా ఫాం హౌస్ నుండి కనీసం సెక్రటేరియట్ కి రాని ముఖ్యమంత్రి 10 ఏళ్లు ఉంటే ఈరోజు దేశ ఎల్లలు దాటి తెలంగాణ  ప్రజల బాగు కోసం  ప్రజా పాలన పేరు మీద బాగు చేయాలని ఆలోచనతో ఉన్న ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి  విమర్శిస్తున్న తీరును ప్రజలు ఆలోచన చేయాలి. ప్రభుత్వ పర్యటనలో  తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి అనేక అంశాలు ముందడుగు పడుతుంటే కుటుంబపరమైన అంశాలు ప్రస్తావిస్తూ దానిని చులకన చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్  అనేక సందర్భాల్లో విదేశీ పర్యటనలు చేశారు. గత ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఏనాడూ నిధులు తీసుకురావాలనే ఆలోచన చేయలేదు. వారి వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి ఆరోపణలు చేస్తున్నారు. మంచిది కాదు
బిఆర్ఎస్ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. నమస్తే తెలంగాణ పేపర్ లో నిలువునా విరిగిపడ్డ సుంకి శాల కోడ కూలీ తృటిలో తప్పిన పెను ప్రమాదం అంటున్నారు. ఈ పని జరిగింది బిఆర్ఎస్ హయంలో,
దీనికి సంబంధించిన కారణాలపై విచారణకు అదేశిస్తున్నం.
ముఖ్యమంత్రి  సూచన మేరకు హైదారాబాద్ ఇంచార్జి మంత్రి గా నీళ్ళు హైదారాబాద్ కి తీసుకొచ్చే ప్రక్రియ లో భాగంగా  మున్సిపల్, హెచ్ఎం డిఎ, మెట్రో వాటర్ వర్క్స్ అధికారులను పూర్తిగా విచారణకు అదేశిస్తున్నాం. దీనికి కారణం పూర్తిగా దోషి బిఆర్ఎస్, మీరు విచారణకు సిద్ధమా.? ప్రజలను తప్పుదోవ పట్టించడం కాదు, బిఆరెస్ తప్పులను ప్రజల ముందు చూపెడతాం. మసిపూసి బట్ట కాల్చి మీద పడేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. బిఆర్ ఎస్ వైఫల్యాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. మొన్ననే కాళేశ్వరం కి సంబంధించి లోప భూయిస్ట నిర్ణయాలతో తెలంగాణ ప్రజలకు నష్టం జరిగింది. రైతు వేధికల్లో రైతులు చెబుతున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రైతులకు వచ్చిన ప్రయోజనాలు  గత 10 ఏళ్లలో రాలేదంటున్నారు. తెలంగాణ ఏర్పడ్డ తరువాత బాగవుతుందనుకున్నం అంత హీనంగా జరిగిందని  రైతులే స్వయంగా చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే  అన్ని రకాలుగా సమస్యలు పరిష్కరిస్తూ ఒకటో తారీఖు జీతాలు ఇస్తూ, రుణమాఫీ చేస్తూ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రభుత్వం అన్ని రకాల విచారణలు చేయడానికి సిద్ధంగా ఉంది. సుంకీ శాల పై కూడా విచారణకు ఆదేశిస్తున్నం..సమగ్రమైన రిపోర్ట్ తెప్పించ్చుకొని ఆనాడు బిఆరెస్ హయంలో ఎవరైతే బాధ్యులు ఉన్నారో కఠిన చర్యలు తీసుకుంటాం. సాంకేతిక పరమైన నివేదికలతో మీ ముందుకు వస్తామని అన్నారు.
ప్రాథమిక రిపోర్ట్ రాగానే తెలంగాణ ప్రజల ముందు ఉంచుతాం. బిఆరెస్ పార్టీ డిఫెన్స్ లో పడి అసెంబ్లీ లో సోషల్ మీడియా లో గిరిజన మహిళా అని చూడకుండా సోషల్ మీడియా లో పోస్ట్ లు చేశారు. అసందర్భమైన ఆరోపణలతో శాసన సభ లో సరైన విధంగా జవాబులు చెప్పలేక. స్పీకర్ గారు దళితుడు అని దొర తనంతో అధ్యక్ష అని పిలువలేక శాసన సభకు రాలేకపోయారని అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లో గ్యారంటీ స్కీమ్స్ అమలు కానీ 200 యూనిట్ల లబ్ధి జరగని వారిని,500  గ్యాస్ రాని వారిని కరెక్షన్ చేసుకొమ్మని చెప్తున్నాం. రైతు రుణమాఫీ రాని వారి వివరాలు సేకరిస్తున్నాం. ఒక భీమదేవరపల్లి మండలంలో 21 కోట్లు రైతు రుణమాఫీ వచ్చింది 2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేస్తున్నామని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్