- Advertisement -
మల్కాజిగిరి నియోజకవర్గం లోని రైల్వే క్రాసింగ్ లను ఈరోజు మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ సందర్శించారు.
Etela visited railway crossings
నేరేడ్మెట్ వాజ్పేయి నగర్ వద్ద రైల్వే క్రాసింగ్, వినాయక నగర్ రైల్వే క్రాసింగ్ ని రైల్వే అధికారులతో కలిసి ఎంపీ ఈటల రాజేందర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజికవర్గం పరిధిలో అనేక రైల్వే క్రాసింగ్ ఉన్నాయి , చాలా చోట్ల పనులు సాంక్షన్ అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకపోవడంతో పూర్తి కాలేదని ఆరోపించారు. ఈ రోజు సుమారు 10రైల్వే క్రాసింగ్ ని సందర్షించమని , ఈ రోజు హైద్రాబాద్ వాసులు ట్రాఫిక్ జామ్ తో అతలాకుతలం అవుతున్నారని త్వరలోనే ఈ రైల్వే క్రాసింగ్ సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.
- Advertisement -