- Advertisement -
ఫిల్మ్ నగర్లో ఆక్రమణలను తొలగించినా హైడ్రా
Even if the encroachment is removed in Film Nagar, Hydra
హైదరాబాద్
ఫిల్మ్ నగర్ లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు శనివారం కూల్చివేసారు. ఫిలింనగర్ ప్రధాన రహదారి కలిసిన ఫిల్మ్ నగర్ రహదారి 9 కలిసిన చోట ఆక్రమించి నిర్మించిన కట్టడం పై హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేసారు. ఫిలింనగర్ లేఅవుట్ ను హైడ్రా అధికారులు పరిశీలించారు. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు జరిగినట్టు నిర్ధారించారు. అదే స్థలానికి అనుకుని వున్న యిల్లు ప్రహరీ కూడా ఆక్రమించి నిర్మించినట్టు నిర్ధారణ అయింది. అక్కడ రేకుల షెడ్డుతో పాటు ఆపక్కనే యింటి ప్రహరీని కూల్చేసారు. కూల్చివేతలు జరిగిన వెంటనే డెబ్రీస్ ను తొలగించారు. జీహెచ్ఎంసి mc ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ఆనురాగ్ జయంతి తో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మాట్లాడారు. వెంటనే రోడ్డు నిర్మించాలని జోనల్ కమిషనర్ కు సూచించారు. 15 ఏళ్లుగా అక్కడ నిర్మాణాలు వున్నాయి అని స్థానికులు చెప్పారు.
- Advertisement -