పాలమూరులోని ప్రతి పల్లెకు కృష్ణమ్మ

- Advertisement -

ఈ రోజు ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగస్వామిని కావడం చిరస్మరణీయమైన అంశంగా భావిస్తున్నాను.  నా ఇంటికి కూడా కృష్ణమ్మ అని పేరు పెట్టుకున్నాను .. పాలమూరు ప్రజల ఆకలి, దాహార్తి తీర్చేది కృష్ణమ్మ అని ఆనాడు ఆ పేరు పెట్టుకున్నాను   ఈ రోజు పాలమూరులోని ప్రతి పల్లెకు కృష్ణమ్మ రాబోతున్నది .. ఈ సందర్భాన్ని ప్రతి ఒక్కరం సంతోషంగా స్వాగతిద్దాం .. గర్వపడదాం. పార్టీలు, ప్రభుత్వాలకు అతీతంగా ప్రజల్లో సమూల మార్పుకు దోహదపడే అంశంగా దీనిని చూడాలి. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు పాలమూరుకు ఆకలిచావులు, ఆత్మహత్యలు, వలసలను బహుమతి గా ఇచ్చి శాపంగా నిలిచారు . తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచంలోనే అతిపెద్ద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ వరంగా ఇచ్చారు.  పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన నార్లాపూర్ పంప్ హౌస్ లో  ఈ నెల 16న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మోటార్లు ప్రారంభించనున్న నేపథ్యంలో జరిగే బహిరంగసభకు పెద్ద ఎత్తున ప్రజలు, రైతులు తరలిరావాలని పిలుపునిచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

Every village in Palamuru has Krishnamma
Every village in Palamuru has Krishnamma
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular