తన చట్టాలు వాటి అమలు పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి
Everyone should be aware of their laws and their implementation
జిల్లా ఎస్పి డి. ఉదయ్ కుమార్ రెడ్డి.. అదనపు ఎస్పి అడ్మిన్ ఎస్. మహేందర్..
మెదక్
జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులకు నూతన చట్టాలు వాటి అమలు పై సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పి డి. ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ. నూతన చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. భారతీయ న్యాయ సంహిత బి.ఎన్.ఎస్, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత బి ఎన్ ఎస్ ఎస్, భారతీయ సాక్ష్యా అధినియం-2023 పై జిల్లాలలోని పోలీస్ అధికారులు, సిబ్బందికి ఇది వరకే శిక్షణ ఇచ్చామని జూలై ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక్ సురక్ష సంహిత భారతీయ సాక్ష్యా అధినియం-2023 చట్టాలు అమలులోకి వచ్చాయని అన్నారు. ప్రతీ పోలీస్ అధికారి, సిబ్బందికి కొత్త చట్టాలపై అవగాహన ఉండాలనే ఉద్దేశంతో శిక్షణా తరగతులు నిర్వహించామని తెలిపారు. కొత్త చట్టాలు అమలు జరిగిన వెంటనే ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని సెక్షన్లపై పూర్తి అవగాహన అవసరమన్నారు. నూతన చట్టాల ద్వారా కేసుల దర్యాప్తు, విధి విధానాలు, విచారణ పద్ధతుల్లో, శిక్షలలో మార్పు వస్తుందని, ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించేందుకు ఈ కొత్త చట్టాలు వీలుగా ఉంటాయన్నారు. అధికారులు, సిబ్బంది కొత్త చట్టాలను నేర్చుకొని అవగాహన పెంచుకోవాలని సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ. అడ్మిన్ ఎస్. మహేందర్ ,తూప్రాన్ డిఎస్పీ వెంకట రెడ్డి, మెదక్ డిఎస్పీ. ప్రసన్న కుమార్,ఎస్బీ సిఐ సందీప్ రెడ్డి, డీసీఆర్బీ సిఐ మధుసూదన్ గౌడ్, జిల్లా సిఐ లు జిల్లా ఎస్సై లు, ఐటీ కోర్ సిబ్బంది అనిల్ తదితరులు పాల్గొన్నారు.