Thursday, April 16, 2026

ఏపీలో ఈవీఎం పాలిటిక్స్

- Advertisement -

ఏపీలో ఈవీఎం పాలిటిక్స్

EVM Politics in AP

విజయవాడ, ఆగస్టు 29 (న్యూస్ పల్స్)
2024 ఎన్నికల ఫలితాలపై అనుమానాలున్నాయంటూ వైసీపీ నేతలు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారిని కలిశారు. ఈసీ ప్రకటించిన పోలింగ్‌ శాతానికి.. కౌంటింగ్‌లో చూపిన పోలీంగ్‌ పర్సంటేజీకి మధ్య తేడా వుండడం అనుమానాలకు తావిస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.. ఎన్నికలు జరిగిన రోజు ఈసీ ఫైనల్‌గా 80.66 శాతం పోలింగ్‌ నమోదయినట్టు ప్రకటించిందన్నారు. జూన్‌4న కౌంటింగ్‌లో మాత్రం పోలింగ్‌ పర్సెంటేజీని 82శాతంగా చూపారన్నారు అంబటి. ఈ తేడా ఎందుకొచ్చింది? ఇన్ని రోజులైనా పార్టీల వారీగా ఓట్లను ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారాయన. ఇక ఈవీఎం బ్యాటరీ చార్జింగ్‌ 99 శాతం ఉండడం ఏంటన్నారు. భద్ర పరిచాక బ్యాటరీ ఛార్జింగ్‌ ఎలా పెరుగుతుందన్నారు. వీవీ ప్యాడ్‌లను లెక్కించమమే మాక్‌ పోలింగ్‌ అంటున్నారు. ఈవీఎంల తనిఖీ కోసం వెళ్తే అధికారులు తమ దగ్గర తాళం చెవి లేదని చేతులెత్తేశారని.. ఇలా ప్రతీ అంశం అనుమానాస్పదంగా వుందన్నారు. తమకు ఉన్న సందేహాలు ఈసీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీదేనని అంబటి రాంబాబు పేర్కొన్నారు.కాగా.. ఈవీఎంలపై వైసీపీ ఈసీని ఆశ్రయించడాన్ని కూటమి నేతలు తప్పు పట్టారు. ప్రజాతీర్పును వైసీపీ గౌరవించాలన్నారు కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ. ఫలితాలు ప్రకటించిన రెండు నెలల తరువాత అనుమానాలేంటన్నారాయన. ఈవీఎంల ట్యాంపరింగ్‌కు అవకాశం లేదన్నారు మంత్రి సత్యకుమార్‌. ఓటమికి కారణాలను విశ్లేషించుకోవాల్సింది పోయి ఈవీఎంలపై అనుమానాలంటూ వైసీపీ ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు . 2019లో ఈవీఎంలపై వైసీపీకీ డౌట్లు రాలేదా? అని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు ప్రశ్నించారు.ఈవీఎంలపై తలెత్తుతోన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీదని వైసీపీ అంటోంది.ఇదంతా ప్రజల దృష్టి మర్చలాడినికి వైసీపీ వేసిన ఎత్తుగడ అంటున్నారు కూటమి నేతలు. అలా ఈవీఎంల కేంద్రంగా ఏపీ పాలిటిక్స్‌ హీటెక్కుతున్నాయి

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్