నాపై తప్పుడు ప్రచారం
వైఎస్ షర్మిలా రెడ్డి
కడప
నేను 1000 కోట్లు పని అడిగానని నాపై తప్పుడు ప్రచారం చేయనున్నారని ఏపీసీసీ ఛీఫ్ షర్మిల రెడ్డి ఆరోపించారు. ఇలా మాట్లాడే వాళ్ళు జగన్ పడేసే కుక్క బిస్కెట్లకు ఆశ పడే వాళ్ళు. ముందు ఇలా మాట్లాడుతున్నందుకు మీకు ఎంత అందుతున్నాయి చెప్పండి ? వెయ్యి ఏంటి 10 వేల కోట్ల వర్క్ అడిగాను అని కూడా చెప్తారు. నేను ఒక్క పైసా సహాయం అడగలేదు. నిరూపిస్తే రాజకీయాలు వదిలి వెళ్లిపోతా. వీళ్ళు ఊసరవెల్లులు. అవసరానికి వాడుకుంటారు. అవసరం తీరాక పుట్టుకనే అనుమనిస్తారు. తల్లి విజయమ్మ పై సైతం నిందలు వేశారు. ఒక సారి ఆలోచన చేయండి. ఇదే జగన్ మోహన్ రెడ్డిచ వైఎస్సార్ మరణం వెనుక రిలియన్స్ హస్తం ఉందని అన్నారు. అందరు నమ్మారు…ఆ సంస్థపై దాడులు కూడా చేశారు..కేసులో కూడా ఇరుకున్నారు. సిఎం అయ్యాక ఆ సంస్థ చెప్పిన వాళ్లకు ఎంపీ పదవి ఇచ్చారు.
జగన్ మోహన్ రెడ్డి వివేకా హత్య తర్వాత సిబిఐ విచారణ అడిగారు. సిఎం అయ్యాక విచారణ వద్దు అన్నారు. అప్పుడొక మాట… ఇప్పుడొక మాట. వైఎస్సార్ పేరు ను సిబిఐ ఛార్జ్ షీట్ లో పెట్టించారు. పొన్నవోలుకి అడ్వకేట్ జనరల్ పదవి ఇచ్చారు. సొంత తండ్రి పేరు సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్పించిన ఘనత జగన్ దని అన్నారు.
అవినాష్ రెడ్డి నా భర్త అనిల్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ల్యాండ్ కృజర్ లో వెళ్లి కలిశాడట. అవినాష్ రెడ్డి లాగ మద్య రాత్రి గొడ్డలితో వెళ్ళడం మాకు చేతకాదు. అనిల్ కలవలేదు..మీరు రుజువు చేయలేదు. అనిల్ కి ఏ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదని అన్నారు.
నాపై తప్పుడు ప్రచారం వైఎస్ షర్మిలా రెడ్డి
- Advertisement -
- Advertisement -