- Advertisement -
పండించే రైతు గోస ప్రభుత్వాలకు పట్టదా
Farmers who grow do not care about governments
మెట్ పల్లి,
:గత ప్రభుత్వం పై రైతులు తెలిపిన శాంతియుత నిరసనలకు అక్రమ కేసులు పెట్టి తిప్పలు పెడుతుంది పసుపు బోర్డ్, పసుపుకు మద్దతు ధర,మక్కలు కొనాలని , చక్కెర ఫ్యాక్టరీ తెరవాలని తెలిపిన నిరసనలో రైతులపై అప్పటి ప్రభుత్వం రైతు ఉద్యమలకు సంబంధించిన వారిపై కక్ష పూర్వకంగా అక్రమ కేసులు నమోదు చేసింది, అప్పుడు రైతు ఉద్యమంలో కలిసి పనిచేసిన ప్రస్తుత అధికార పార్టీకి చెందిన నాయకులు గత ప్రభుత్వం మాదిరిగానే రైతులను విస్మరించడం బాధాకరమని శుక్రవారం మెట్ పల్లి కోర్టు కేసు విషయంలో పేషీకీ వచ్చిన రైతు నాయకులు గోస వెలిబుచ్చారు. ఇప్పటికైనా ప్రజా పాలన రైతు శ్రేయస్సు కోరే ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మరియు మంత్రి వర్గం రైతులపై దృష్టిసారించి రైతు ఉద్యమ నాయకుల పై గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను వెంటనే ప్రభుత్వం ఎత్తివేయాలని ఈ సందర్భంగా రైతు నాయకులు కోరారు,ఈ కార్యక్రమంలో రైతు ఐక్యవేదిక నాయకులు పన్నాల తిరుపతిరెడ్డి,కోడిపెల్లి గోపాల్ రెడ్డి,మారు మురళీధర్ రెడ్డి,బందెల మల్లయ్య,వేముల కర్ణాకర్ రెడ్డి, మహేందర్ రెడ్డి,కొమిరెడ్డి లింగారెడ్డి,అన్నాడి జలపతి రెడ్డి, ఏలేటి శంకర్ రెడ్డి, మహిపాల్ రైతులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -