Monday, May 18, 2026

జర్నలిస్ట్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత ….

- Advertisement -

జర్నలిస్ట్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత ….

Financial assistance to journalist's family 

జమ్మికుంట

ప్రమాదవశాత్తు గాయపడి క్షతగాత్రునిగా మిగిలిన పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం చిన్న రాత్పల్లి
గ్రామానికి చెందిన బందేల రాజశేఖర్ ఈనెల 4వ తారీఖు నా విధులు నిర్వర్తించుటకు పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోకి వెళుతుండగా తన ద్విచక్ర వాహనం నుండి క్రిందపడి తీవ్ర గాయాలు అవడంతో శస్త్ర చికిత్స ద్వారావైద్యులు ఆయన కుడి కాలు తొలగించారు .విషయం తెలుసుకున్న హుజురాబాద్ నియోజకవర్గం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్ష , కార్యదర్శులు సౌడమల్ల యోహాన్ ,ఏబూసి సంపత్, ఆధ్వర్యంలో రాజశేఖర్, కుటుంబానికి ఆదివారం రోజున ఆర్థిక సహాయాన్ని అందించి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు .ఆ తర్వాత ఎస్ ఆర్ కే డైరీ చైర్మన్ బండారి మారుతి కూడా తమ సంస్థ ద్వారా గాయపడిన జర్నలిస్టు కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని  అందించారు .ఫోన్ ద్వారా క్షతగాత్రుడిని పరామర్శించిన మారుతి మాట్లాడుతూ భవిష్యత్తులో ఏ జర్నలిస్టుకు ఏ ఆపద ఎదురైన అందుబాటులో ఉండి ఆదుకుంటానని హామీని ఇచ్చారు . అనంతరం టిడబ్ల్యు జెఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉంటూ తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉండి తోడ్పాటు అందించాలని ,అలాగే జర్నలిస్టు సంఘాలు కూడా శక్తి వంచన లేకుండా ఆర్థిక సహాయాన్ని అందించి చేయూతనివ్వాలని వారు అన్నారు .ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులతోపాటు , సంఘం సభ్యులు వలిపిరెడ్డి శ్రీనివాస్ , ఎండీ రఫీక్ ఎండి ఖాజఖాన్ ,రచ్చ రవి కృష్ణ , లతోపాటు సంఘ సభ్యులు పాల్గొన్నారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్