- Advertisement -
మృతిచెందిన హెచ్ సి కుటుంబానికి ఆర్థిక సాయం
జగిత్యాల
జిల్లా లోని కథలాపుర్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తూ అనారోగ్యంతో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ షేక్ హబీబ్ కుటుంబానికి జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ భద్రత పథకం కింద మంజూరు కాబడిన 8 లక్షల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
హబీబ్ కుటుంబానికి పోలీస్ శాఖ తరుపున పూర్తి సహకారం అందిస్తూ వారి కుటుంబానికి భరోసా కల్పిస్తామని ఎస్పీ ఆన్నారు..ఈ కార్యక్రమంలో ఏ ఎస్పీ శివం ఉపాధ్యాయ, బి సెక్షన్ సూపరిండెంట్ నయీం పాల్గొన్నారు
- Advertisement -