- Advertisement -
చిలకలూరు గ్రామంలో అగ్నిప్రమాదం.
Fire in Chilakalur village.
పశువులపాక దగ్ధం.
30 గొర్రెలు పొట్టేలకు తీవ్ర గాయాలు.
రూ 2 లక్షల దాకా నష్టం.
రుద్రవరం.
మండలంలోని చిలకలూరు గ్రామంలో సోమవారం రాత్రి సంభవించిన అగ్నిప్రమాదంలో పశువుల పాక దగ్ధమైంది. ఈ ప్రమాదంలో రూ 2 లక్షల విలువచేసే గొర్రెలు పొట్టేళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన వెంకటరమణ అనే రైతు పశువుల పాకలో తనకున్న గొర్రెలు పొట్టేలను కట్టివేసి ఉంచారు. రాత్రి సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వ్యాపించి పశువులపాక పూర్తిగా కాలిపోయిందని గ్రామస్తులు తెలిపారు. ఈ ప్రమాదంలో రైతుకు తీవ్ర నష్టం జరిగిందని ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని గ్రామస్తులు కోరారు.
- Advertisement -