- Advertisement -
ఎర్రవల్లిలో ఓమ్ని వాహనం నడిపిన మాజీ సీఎం కేసీఆర్
సిద్దిపేట
మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలో ఓమ్ని వాహనం నడిపించారు. సదరు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గతేడాది డిసెంబర్ లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో అయన కాలుజారి పడ్డ విషయం తెలిసిందే. తుంటి ఎముక గాయంతో సోమాజిగుడా యశోద ఆస్పత్రిలో చికిత్స తీసుకుని కొద్దీ రోజులు వాకర్ సహాయంతో అయన నడిచారు. ఇప్పుడు డాక్టర్ల సూచనతో ఓమ్ని వాహనం నడిపినట్టు సమాచారం. ఎర్రవల్లి ఫామ్ హౌస్ పరిసరాల్లో రెండు కిలోమీటర్ల మేర గులాబీ బాస్ స్వయంగా వాహనం నడిపించారు.
- Advertisement -



