మాజీ సీఎస్ భూబాగోతం,త్వరలో విచారణ?
తెలంగాణ/రంగారెడ్డి:హోదా ఉందని కొందరు అవినీతి చక్రవర్తుల నాయకులకు తలోగ్గితే తీరా అధికారం పోయాక పరిస్థితి ఎలా ఉంటుందో ప్రస్తుతం చాలామంది అధికారులను,నాయకులను కూడా చూస్తున్నాం.మొన్నటికి మొన్న రంగారెడ్డి జిల్లా మాజి కలెక్టర్ అమోయ్ కుమార్ బలైయ్యారు,ఇదే కోవలోకి మన తెలంగాణ మాజీ సీఎస్ కూడా చేరిపోయినట్లున్నారు…మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలో తన భార్య పేరిట 25 ఎకరాల భూమి కొన్నట్లు ధరణి పోర్టల్ లో నమోదైంది..దీనిపై రాజకీయ,అధికార వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.ఎకరానికి కోట్లు విలువ చేసే భూమిని కేవలం రూ.2 లక్షలకు కొన్నట్లు తెలుస్తోంది.క్విడ్ ప్రోకో లో భాగంగానే ఈ వ్యవహారం జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి.కాగా,దీనిపై త్వరలోనే విచారణ చేయనున్నట్లు సమాచారం. మరి ముఖ్యమంత్రి రేవంత్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు,చర్యలు తీసుకుంటుందో చూడాలి ఇక…