ఫోషణ పక్షం – ఆరోగ్య లక్ష్యం
జగిత్యాల,
మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ పోషణ పక్షోత్సవాలలో భాగంగా సోమవారం జిల్లా లోని సారంగాపూర్ మండలం రెచపెల్లి సెక్టార్ లోని రంగపేట గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్వాడ్ పక్షోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐసిడిఎస్ సూపర్వైజర్లు శైలజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా చిన్నారులకు అక్షరాభ్యాసము గర్భిణీ స్త్రీలకు సీమంతాలను నిర్వహించారు. అనంతరం సూపర్వైజర్ శైలజ మాట్లాడుతూ చిరుధాన్యాలతో కూడిన ఆహారాన్ని గర్భిణీ స్త్రీలు బాలింతలు తప్పనిసరిగా తీసుకోవాలని చిరుధాన్యాలతో కూడిన ఆహారం తీసుకోవడం వలన పోషక లభిస్తాయని తద్వారా ప్రవేశపెట్టిన కూడా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.
పోషక విలువలతో కూడిన ఆహారమును పిల్లలకు పిల్లలకు అందించాలని కోరారు. విటమిన్ లోపం లేకుండా పచ్చి కూరగాయలు ఆకుకూరలతో మంచి ఆహారాన్ని తీసుకోవాలని కోరారు. ఆహారపు అలవాట్లు, పోషిక ఆహారాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు నీలిమ, రంగపేట అంగన్వాడి టీచర్లు శ్యామల తిరుపతమ్మ , ఆశ , అంగన్వాడి ఆయాలు, తల్లులు. ,పిల్లలు తదితరులు పాల్గొన్నారు