చిలుకానగర్ లో హిందూ స్మశాణ వాటిక అభివృద్ది పనులకు శంకుస్థాపన

- Advertisement -

చిలుకానగర్ లో హిందూ స్మశాణ వాటిక అభివృద్ది పనులకు శంకుస్థాపన

Foundation stone laying for development works of Hindu cemetery in Chilukanagar

పాల్గోన్న నగర మేయర్ విజయలక్ష్మి
మేడ్చల్
ఉప్పల్ నియోజకవర్గం లోని చిలుకానగర్ డివిజన్లో 1.98కోట్ల నిధులతో హిందూ స్మశాన వాటిక అభివృద్ధి పనులకు మేయర్ గద్వాల విజయలక్ష్మి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మేయర్ గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతూ… చిలకానగర్ డివిజన్ లో గత నాలుగు సంవత్సరాల నుండి కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ సూచనల మేరకు అనేక అభివృద్ధి పనులకు నిధులు ఇచ్చి అభివృద్ధి చేయడం జరిగింది.ఈ సంవత్సరం చివరణలో జిహెచ్ఎంసి ఎన్నికలు ఉండబోతున్నాయి. ఈ ముప్పై తేది నుండి కౌన్సిల్ మీటింగ్ ఉంటుంది. కౌన్సిల్ మీటింగ్ లో కుర్చీలు ఎత్తుతూ గొడవలకి దిగకుండా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల కార్పొరేటర్లు అభివృద్ధి గురించి మాట్లాడాలని మేయర్ పేర్కొన్నారు.150 డివిజన్లో అభ్యర్థులు అధిక శాతంలో వారే నిలబడే అవకాశం ఉన్నందున అభివృద్ధి పనులతో డివిజన్ ప్రజల మనసులు గెలుచుకొని వారి వారి గెలుపునకు కృషి చేసుకోవాలన్నారు.కౌన్సిల్ మీటింగ్ లో డివిజన్ అభివృద్ధి కోసం మాట్లాడితే తగినంత సమయం ఇస్తాను అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular