సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం: గడాల శ్రీనివాస్ రావు
కొత్తగూడెంలో పొలిటికల్ కామెంట్లు చేయొద్దని మంత్రి హరీశ్‌రావు నాకు సూచించినట్లుగా, ఫోన్ చేసి క్లాస్ తీసుకున్నట్టుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం.
డాక్టర్ జీఎస్‌ఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆదివారం కొత్తగూడెంలోనే ఉన్నాను. అక్కడి ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు గడప గడపకు గడల కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలో గిట్టని వ్యక్తులు తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారు. ప్రజలు, మీడియా మిత్రులు ఆ ప్రచారాలను నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరెన్ని అడ్డుపుల్లలు వేసినా కొత్తగూడెంలో డా.జీఎస్‌ఆర్ ట్రస్ట్ సేవలు నిరాటంకంగా కొనసాగిస్తాం. సీఎం కేసీఆర్ స్పూర్తితో ముందుకెళ్తాం. డాక్టర్ గడల శ్రీనివాసరావు