- Advertisement -
రూ. 3 కోట్ల విలువ గంజాయి దహనం..
Ganjayi worth 3 crores burntభద్రాద్రి
భద్రాచలం ఎక్సైజ్ పోలీస్‌లోని 1186 కేజీల గంజాయిని దగ్ధం చేసారు . రూ.3 కోట్ల విలువ చేసే 1186 కిలోల గంజాయిని సోమవారం దహనం చేయించామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. భద్రాచలం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐదు కేసుల్లో పట్టుబడిన గంజాయిని ఏడబ్ల్యుఎం కన్సటింగ్ లిమిటెడ్ దహన కేంద్రంలో గంజాయిని దగ్ధం చేశారని తెలిపారు. గంజాయిని దగ్ధం సమయంలో ఖమ్మం డిప్యూటి కమిషనర్ జనార్థన్‌రెడ్డి, అసిస్టేంట్ కమిషనర్ గణేష్, భద్రాది కొత్తగూడెం ఎక్సైజ్ సూపరిండెంట్ జనాయ్య, భద్రాచలం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సీఐ రహీమ్ ఉన్నీషా బేగం ఉన్నారని తెలిపారు
- Advertisement -




