
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణి ప్రవీణ్
జగిత్యాల జిల్లా బ్యూరో (అక్టోబర్ 31,23)వాయిస్ టుడే : కేంద్రం నుంచి వచ్చే నిధులను ఇతర పథకాలకు దారి మల్లించి, కేంద్రం పైసా ఇవ్వలేదని బద్నామ్ చేసే కుట్రకు బి ఆర్ యస్ తెరలేపిందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణి ప్రవీణ్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం తాటి పెల్లి గ్రామంలో ప్రజల గోస – బిజెపి భరోసా పేరుతో గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా శ్రావణి మాట్లాడుతూ తాటి పెల్లి గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు ఎక్కడ రావడం లేదని, ఒకవేళ భగీరథ నీళ్లు వచ్చి, తాగే వారు బీఅర్ఎస్ కు ఓటయ్యాలని, నీళ్లు రావడం లేదనే వారు మాత్రం బిజెపికి ఓటు వెయ్యాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం, మోదీ పాలనలో గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేస్తుందని, కేంద్రం నుంచి వచ్చే నిధులను దారి మల్లించి, కేంద్రం నిధులు ఇవ్వడం లేదని ప్రజలను దారి మల్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఏనాడైనా నిరుద్యోగులు, పట్టభద్రుల సంక్షేమం కొరకు దీక్షలు చేశారా?
ధర్నా లు చేశారా?
ఏనాడైనా శాసన సభలో నిరుద్యోగ, పట్టభద్రుల సమస్యలు లేవనేత్తారా?
అని ఆమె ప్రశ్నించారు. ఇంకా రెండేళ్లు పదవికాలం ఉండగ, పదవుల కోసం వేంపరలాట ఎందుకు?
అని జీవన్ రెడ్డికి శ్రావణి చురకలు అంటించారు. ఇన్నెండ్లు మహిళలతో ఓట్లు వేసుకున్నారని, ఈ సారి మహిళలకు అవకాశం ఇవ్వలని శ్రావణి డిమాండ్ చేశారు.ప్రజల గోస – బిజెపి భరోసా యాత్ర పేరుతో గడప గడప కు వెళ్తున్నామని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ తో గ్రామాలు, పట్టణాలకు మరింత నిధుల వరద వచ్చి, ఊహించని అభివృద్ధి రాష్ట్రంలో జరుగుతుందని ఆశభావం వ్యక్తం చేశారు.రైతు రుణమాఫీ చెయ్యడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అక్షేపించారు. తెలంగాణా ప్రభుత్వం ఎకరాకు 10వెలు ఇస్తే, బిజెపి ప్రభుత్వం ఎకరాకు సుమారు 24,600/- సబ్సిడీ, సమ్మాన్ నిధుల కింద విడుదల చేస్తుందన్నారు.రైతుల కోసం బిజెపి కన్నా బీఅర్ఎస్, కాంగ్రెస్ లు చేసింది ఏమి లేదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సగం వాటా కలిగి ఉండి ముత్యం పేట్ చెక్కర ఫ్యాక్టరిని ఎందుకు తెరవడం లేదని రాష్ట్ర ప్రభుత్వన్ని ప్రశ్నించారు. ఎంపీగా గెలిచినా సీఎం తనయ కవిత, స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు లు ఎందుకు పదవులు అనుభవించిన తెరిపించడంలో విఫలం అయ్యారని విమర్శించారు. బిజెపి అధికారంలోకి రాగానే మొదటగా చెరుకు కర్మాగారలను తెరిపిస్తామని ఎంపీ అర్వింద్ స్పష్టమైన హామీ ఇచ్చారాని రైతులు గమనించాలని కోరారు. సంక్షేమం పథకాలకు అన్నిటికి రేషన్ కార్డు తప్పనిసరి చేసిన రాష్ట్ర ప్రభుత్వం , పదేళ్లు గడిచిన ఒక్క కొత్త రేషన్ కార్డు ఎందుకు ఇవ్వలేదని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అనేక మంది లబ్ధిదారులు దళిత బంధు, బిసి బంధు, మైనార్టీ బంధు, గృహలక్ష్మి పథకాలకు అనర్హులుగా మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత, బిసి బంధు పథకాలు గులాబీ బంధు గా మారాయన్నారు. ఉజ్వల పథకం కింద మోదీ గారు ఉచిత సిలిండర్ లు ఇస్తుంటే, కాంగ్రెస్ వాళ్ళు 400రూపాయలకే సిలిండర్ అని గోడలపై రాతలు రాసుకోవడం విడ్డురంగా ఉందన్నారు. కాంగ్రెస్ అరు గ్యారంటీ లు అంటూ విస్తృత ప్రచారం చేసుకుంటుందని, కానీ కాంగ్రెస్ లో గెలిచిన వారు వేరే పార్టీలోకి వెళ్ళరనే ఒక్క గ్యారంటీని ప్రజలకు ఇవ్వగలరా అని శ్రావణి ప్రశ్నించారు.ఎవరెన్ని కుట్రలు చేసిన, ఎంత అర్భాటలతో ప్రచారం చేసిన చివరికి గెలుపు బీజేపీ దే నని ధీమా వ్యక్తం
చేశారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల రురల్ మండల అధ్యక్షులు నలువాల తిరుపతి,ఎంపీటీసీ పూదరి శ్రీనివాస్, జిల్లా కోశాధికారి సుంకేట దశరథరెడ్డి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు కర్నే నర్సింహారెడ్డి, రూరల్ మండలం మహిళా మోర్చా అధ్యక్షురాలు పత్తి రామేశ్వరి, జిల్లా చేనేత సెల్ కన్వీనర్ కొక్కుల గణేష్, కిసాన్ మోర్చా మండల ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి, బూత్ అధ్యక్షులు నీరేటి వెంకటేష్, బక్కశెట్టి నాగరాజ్,బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి కురుమ రమేష్, ఓల్లాల రాజశేఖర్, చేని శ్రీకాంత్, జంగా తిరుపతి, ఐ టి సెల్ కన్వీనర్ పూదరి గణేష్,కొల గంగిరెడ్డి, బియ్యని రాజేందర్, ఏంబరి శేఖర్,పుదరి దరి మరియు నాయకులు,కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.



