1.4 C
New York
Monday, February 26, 2024

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలివ్వండి

- Advertisement -

సమాచార మంత్రికి టీడబ్ల్యూజేఎఫ్ వినతి

జర్నలిస్టులకు వెంటనే ఇండ్ల స్థలాలు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య, ఉపాధ్యక్షుడు పులిపలుపుల ఆనందం తదితరులు మంగళవారం రాష్ట్ర సమాచార శాఖ మంత్రి మహేందర్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మంత్రితో ఇండ్ల స్థలాల సమస్యపై చర్చించారు. ఇండ్ల స్థలాల కోసం వేలాదిమంది జర్నలిస్టులు సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్నారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత తొమ్మిదేళ్ళుగా ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేయడమే కాకుండా, తాము సదస్సులు, సమావేశాలు, ధర్నాలు కూడా చేయడం జరిగిందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం నేటి వరకు ఇండ్ల స్థలాలు ఇవ్వలేదని అన్నారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తున్నారని, అందుకు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వారున్నారు. హైదరాబాద్ తోపాటు పలు పట్టణాలు, నగరాల్లో పని చేస్తున్న జర్నలిస్టులకు మాత్రం ఇండ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియ జరగడం లేదని, దీని వల్ల జర్నలిస్టులంతా తీవ్ర నిరాశతో ఉన్నారని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపు ఐదారు వేల మంది జర్నలిస్టులు వివిధ హౌసింగ్ సొసైటీలలో సభ్యులుగా ఉన్నారని, ఆయా సొసైటీలకు స్థలాలు కేటాయించాలని కోరారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని, అదేవిధంగా సీఎం కేసీఆర్ కూడా అసెంబ్లీలో  హామీ ఇచ్చారని వారు గుర్తు చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇళ్ళస్థలాల సమస్యను పరిష్కరించి జర్నలిస్టులలో ఉన్న అసంతృప్తిని తొలగించాలని వారు మంత్రిని కోరారు. జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి కేటాయించి స్థలాన్ని ఆ సొసైటీకి, అదేవిధంగా జూబ్లీహిల్స్ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ పరిధిలో గోపనపల్లిలో ఉన్న తొమ్మిదెకరాల భూమిని ఆ సొసైటీకి అప్పగించాలని వారు మంత్రిని కోరారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని, అన్ని ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో హెల్త్ కార్డులు పని చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. మంత్రిని కలిసిన వారిలో ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు కె. పాండురంగారావు, జే. ఉదయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!