వైభవంగా వైకుంఠ ఏకాదశి
Glorious Vaikuntha Ekadashi
భక్తిశ్రద్ధలతో ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న భక్తులు.
బస్టాండ్ కాలనీలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులకు వెంకటేశ్వర వ్రతకల్పం పుస్తకం ఉచిత పంపిణీ.
గోదావరిఖని:
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని గోదావరిఖనిలోని కోదండ రామాలయంలోనూ, బస్టాండ్ కాలనీలోని వెంకటేశ్వర దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు ఉదయం నుండి ఉత్తర ద్వారా దర్శనం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మమ్మల్ని చల్లంగా చూడాలని మా కోరికలు నెరవేరాలని భగవంతుని వేడుకున్నారు. అలాగే రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాగూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి గోదావరిఖని కోదండ రామాలయం ఆలయాన్ని సందర్శించారు. వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వంశీ కృష్ణ మాట్లాడుతూ, ముక్కోటి ఏకాదశి పర్వదినం భక్తుల కోసం ఎంతో ప్రత్యేకమైనది. ఈ పవిత్ర రోజున కోదండ రామాలయం వారిని దర్శించుకోవడం ఎంతో పుణ్యప్రదమైనది. ప్రజల సంక్షేమం, శాంతి, సుఖసంతోషాలు కలగాలని స్వామివారిని ప్రార్థించాను అని తెలిపారు. ఆలయ పరిసరాలను పర్యటించిన ఎమ్మెల్యే గారు, ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కోసం తన వంతు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని వైకుంఠ ద్వార దర్శన భాగ్యాన్ని పొందారు. బస్టాండ్ కాలనీలోని వెంకటేశ్వర దేవాలయంలో కమిటీ సభ్యు లు భక్తులకు తీర్థ ప్రసాదములు అందించారు అలాగే వెంకటేశ్వర వ్రతకల్పం
పుస్తకాలను కమిటీ సభ్యులు
భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు.