విద్యార్థుల ఆరోగ్యం, ఎదుగుదలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి-ఎస్పీ అఖిల్ మహజన్
Government's special focus on health and growth of students-SP Akhil Mahajan
రాజన్న సిరిసిల్ల
దూమల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ లో కామన్ డైట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ
ఒత్తిడి నుండి దూరం కావడానికి యోగా, మెడిటేషన్ అలవర్చుకోవాలి.
విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసిన జిల్లా ఎస్పీ
తరగతి గదులు కలియతిరిగి, విద్యార్థులతో ముచ్చటించి సమస్యలపై ఆరా,
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.
ప్రతి హాస్టల్లో ఒకే రకమైన భోజనం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కామన్ డైట్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. గతంలో ఉన్న డైట్ చార్జీలు 8 సంవత్సరాల తర్వాత 40 శాతం ప్రస్తుత ప్రభుత్వం పెంచిందని, కాస్మోటిక్ చార్జీలను 16 సంవత్సరాల తర్వాత 200 శాతం పెంచిందన్నారు. పాఠశాలలో చదివే విద్యార్థుల ఎదుగుదల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం అత్యంత శ్రద్ధ వహిస్తుదన్నారు.
విద్యార్థిని విద్యార్థులు చిన్నతనంలోనే ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకుని వాటి సాధనకు నిరంతరం కష్టపడాలని సూచించారు. కష్టపడితే ఏదైనా సాధించవచ్చని అందరూ తమ లక్ష్యాలను చేరుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకరావాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఒత్తిడి నుండి దూరం కావడానికి యోగ మెడిటేషన్ వంటివి అలవర్చుకోవాలి, విద్యార్థి దశలో సోషల్ మీడియా, గంజాయి వంటి వాటికి దూరంగా ఉండాలని, వాటి వలన జీవితాలు నాశనం అవుతాయన్నారు.
అనంతరం పాఠశాలలోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి ఎస్పీ భోజనం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృదం, ఎల్లారెడ్డిపేట్ సిఐ శ్రీనివాస్, ఎస్ఐ రమాకాంత్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.