చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని గవర్నర్ తమిళి సై దర్శించుకున్నారు. శుక్రవారం ఆలయానికి వెళ్లిన ఆమెకు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో గవర్నర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర సచివాలయానికి వెళ్లనున్నారు. సెక్రటేరియట్ ప్రారంభం తర్వాత గవర్నర్ తొలిసారి వెళ్లడం విశేషం. కాగా, దాదాపు రెండేండ్లుగా ప్రగతి భవన్, రాజభవన్ మధ్య సం బంధాలు ఉప్పు-నిప్పుగా కొనసాగా యి. రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా తనకు ప్రభుత్వం నుంచి తగిన ప్రోటోకాల్ లేదంటూ గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ నిప్పులు చెరిగారు…
రాజభవన్లో బిల్లులకు ఆమోదం లభించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా ట్విట్టర్ ద్వారా తనదైన శైలిలో తమిళిపై సెటైర్ వేశారు. ఇదిలా ఉండగా.. అనూహ్యంగా మంత్రిగా పట్నం మహేందర్రెడ్డి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో గవర్నర్తో సీఎం దాదాపు 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు. అనంతరం గవర్నర్కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం ఆహ్వానం పలికారు. సచివాలయ ప్రాంగణంలో ప్రభుత్వం నిర్మించిన చర్చి, మసీదు, నల్లపోచమ్మ ఆలయాల ప్రారంభోత్సవానికి రావాలని ఇన్వెట్ చేశారు. దీనికి అంగీకరించిన ఆమె కాసేపట్లో సచివాలయానికి వెళ్లనున్నారు.