Saturday, February 15, 2025

విజయ`సాయి` రెడ్డిగా మారిపోయారా…

- Advertisement -

విజయ`సాయి` రెడ్డిగా మారిపోయారా…

Has Vijaya Sai Reddy turned into...

నిన్న షర్మిళ, ఇవాళ నందమూరి ఫ్యామలితో భేటీలు
విజయవాడ, ఫిబ్రవరి 3, (వాయిస్ టుడే)
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలను మాజీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మూడు రోజుల క్రితం హైదరాబాద్ లో వీరి భేటి జరిగినట్లు ప్రచారం జరుగుతుంది. వైఎస్ షర్మిల ఇంటికి వెళ్లిన విజయసాయిరెడ్డి అక్కడే భోజనం చేసి అనేక విషయాలపై చర్చించినట్లు చెబుతున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ లండన్ నుంచి బెంగళూరుకు వచ్చే ముందే ఈ పర్యటన జరిగినట్లు తెలిసింది. ఇందుకు రాజకీయ కారణాలు ఏమై ఉంటాయన్న దానిపై జోరుగా చర్చ జరుగుతుంది. విజయసాయిరెడ్డి, వైఎస్ షర్మిల ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న రోజులను కొందరు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. వీరి భేటీ ఏ వైపునకు దారితీస్తుందన్న చర్చ జరుగుతుంది. వైసీపీ రాజ్యసభ సభ్యత్వంతో పాటు వైసీపీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి తాను వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. ఈ మేరకు ఆయన కర్ణాటకలో తాను వ్యవసాయం చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలోనూ ఫొటోలు పోస్టు చేశారు. తాను ఇక రాజకీయాలను పట్టించుకోనని తెలిపారు. అలాగని వైఎస్ జగన్ ను విమర్శించలేదు. తన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అదే సందర్భంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ తో కూడా తనకు విభేదాలు లేవంటూ ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో జగన్ ను తీవ్రంగా విమర్శిస్తున్న వైఎస్ షర్మిలను కలవడంతో ఏం జరిగి ఉంటుందన్న దానిపై వైసీపీ నేతలు ఆరా తీస్తున్నారు.జగన్ ఆస్తుల విషయంలోనూ విజయసాయిరెడ్డి వైఎస్ జగన్ పక్షాన నిలిచారు. షర్మిలకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత కూడా షర్మిల ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే జగన్, షర్మిల మధ్య రాజీ కుదర్చడానికి ఆయన భేటీ అయ్యారా? లేక షర్మిలకు తాను చేసిన వ్యాఖ్యల వెనక ఉన్న వాస్తవాలను వివరించడానికి కలిశారా? అన్నది తెలియాల్సి ఉంది. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఇప్పటికే వైసీపీ క్యాడర్ లో కొంత నిరాశగా ఉంది. ఈ సమయంలో షర్మిలతో భేటీ కావడంతో జగన్ కుటుంబంలో ఏదో జరుగుతుందన్న భావన కలుగుతుంది. అయితే వైసీపీ నేతలు మాత్రం ఈ భేటీని అంత తేలిగ్గా కొట్టిపారేయడం లేదు. షర్మిల కూడా విజయసాయిరెడ్డి విషయంలో సానుకూలతను ప్రదర్శించడంపై ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
మరో వైపు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో విజయసాయి రెడ్డి తాజా అడుగులు సంచలనం అవుతున్నాయి. వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్ళిన ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. త్వరలో వైసిపి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. ప్రస్తుతం వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి లండన్‌లో ఉన్నారు. ఆయన రాక కోసం విజయసాయి రెడ్డి వెయిట్ చేస్తున్నారు. వచ్చిన తర్వాత రాజీనామా సమర్పించనున్నారు. రాజకీయాలకు ఆయన గుడ్ బై చెప్పారు. కుటుంబంతో కలిసి టైమ్ స్పెండ్ చేస్తున్నారు. అయితే నందమూరి కుటుంబంతో ఆయన కనిపించడం కొంత మందికి మింగుడు పడడం లేదు. వైసిపికి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు తమ తమ అంచనాలు చెప్పారు. తెలుగుదేశం పార్టీకి దగ్గర అయ్యే అవకాశాలను కూడా కొట్టి పారేయలేమని ఇంకొందరు జోస్యం చెప్పారు. ప్రస్తుతానికి అయితే ఆయన రాజకీయ నాయకులు ఎవరితోనూ కనిపించడం లేదు. కానీ… నందమూరి కుటుంబానికి దగ్గరగా ఉన్నారు.నందమూరి కుటుంబ సభ్యుడు దివంగత కథానాయకుడు, తారక రత్న భార్య అలేఖ్య తెలుసు కదా! విజయసాయి రెడ్డితో పాటు దిగిన ఫోటోను ఆవిడ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘వీకెండ్ విత్ విఎస్ఆర్’ అని పేర్కొన్నారు. అది అసలు సంగతి. ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నట్టు ఆయన తెలిపారు. విజయసాయి రెడ్డి మళ్లీ రాజకీయాల్లోకి వచ్చినా రాకున్నా… ఆయన కుమార్తె మాత్రం బీజేపీలో చేసే అవకాశం ఉందట.నందమూరి కుటుంబానికి కోడలు కాకముందు నుంచి విజయసాయి రెడ్డితో అలేఖ్యకు బంధుత్వం ఉంది. ఆమెకు ఆయన బాబాయ్ వరుస అవుతారు. తారకరత్న, అలేఖ్య వివాహానికి అప్పట్లో ఇరువురి కుటుంబ సభ్యులు అంగీకరించకపోతే..‌. విజయసాయి రెడ్డి తమకు మద్దతు ఇచ్చారని అలేఖ్య గతంలో తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్