- Advertisement -
శాంతి నగర్, జగనన్న కాలనీల్లో హజరత్ సయ్యద్ షా బుఖారి బాబా ఆస్థాన లంగర్ ఖానా అన్నదానం
Hazrat Syed Shah Bukhari Baba Asthana Langar Khana Annadanam in Jagananna Colonies
కార్యక్రమం లో పాల్గొని స్వయంగా అన్నదానం చేసిన హోం మంత్రి అనిత
కొండపల్లి
కొండపల్లి పట్టణ పరిధిలోని శాంతి నగర్, జగనన్న కాలనీలో బుడమేరు వరద బాధితులకు హజరత్ సయ్యద్ షా బుఖారి బాబా ఆస్థాన లంగర్ ఖానా నిత్య అన్నదాత అల్తాఫ్ బాబా ఆధ్వర్యంలో గురువారం మూడు వేల మందికి అన్నదానం చేశారు. ఈ అన్నదాన కార్యక్రమం లో ముంపు ప్రాంతాలను పరిశీలించడానికి వచ్చిన హోం మంత్రి వంగలపూడి అనిత పాల్గొని స్వయంగా అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరద బాధితులకు వేల మందికి ఆత్మీయంగా రుచికరమైన విందు ఆహారం అందిస్తున్న అల్తాఫ్ బాబా అభినందనీయులన్నారు. మునుపెన్నడూ చూడని బుడమేరు, కృష్ణానది వరద తీవ్ర నష్టాన్ని మిగిల్చిందన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు దాతలు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అల్తాఫ్ బాబా కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -