- Advertisement -
హెల్మెట్ అవగాహన ర్యాలీ
Helmet Awareness Rally
షాద్ నగర్
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఆర్టిఏ అధికారుల సమక్షంలో హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ జండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ స్థానిక స్టేడియం నుండి ఆర్టిఏ కార్యాలయం వరకు కొనసాగింది ర్యాలీలో పట్టణ ప్రజలు, పోలీస్ శాఖ, ఆర్టిఏ శాఖ అధికారులు ర్యాలీలో పాల్గొన్నారు.
ఎమ్మెల్యే వీర్లపలి శంకర్ మాట్లాడుతూ…. రోడ్డు ప్రమాదాల వల్ల ముఖ్యంగా యువత మరణాలపాలవుతున్నారన్నారు. చిన్న వయసులోనే మృత్యవు పాలవటం వల్ల తల్లిదండ్రులకు శోకాన్ని మిగులుస్తున్నారన్నారు. రోడ్డు నియమాలు పాటించకుండా మద్యం మత్తులో వాహనాలు నడపడం, హెల్మెట్ ధరించకపోవడం వంటి కారణాలవల్ల అనేకమంది మృత్యువు పాలవుతున్నారని, క్షతగాత్రులుగా మిగిలిపోతున్నారన్నారు. ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని సూచించారు.
- Advertisement -