- Advertisement -
మాజీ మంత్రి విడదల రజినిపై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశం
High Court order to register case against ex-minister Vidada Rajini
పల్నాడు
మాజీ మంత్రి విడదల రజినిపై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశించింది. 2019లో సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నాడని చిలకలూరిపేటకు చెందిన పిల్లి కోటి అనే వ్యక్తిని చిత్రహింసలు పెట్టారని ఆరోపణ. చిలకలూరిపేట పీఎస్లో ఐదురోజులపాటు చిత్రహింసలు పెట్టారని ఆరోపణ. ఇటీవల పలుసార్లు పోలీసులకు టీడీపీ నేత పిల్లి కోటి ఫిర్యాదు చేసాడు. . న్యాయం జరగకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాడు. మాజీ మంత్రి విడదల రజినితోపాటు ఆమె పీఏలు రామకృష్ణ, ఫణి, అప్పటి సీఐ సూర్యనారాయణపై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెండు వారాల్లోగా కేసు నమోదు చేసి వివరాలు ఇవ్వాలని పల్నాడు పోలీసులను ఏపీ హైకోర్టు ఆదేశించింది.
- Advertisement -