రూ.2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ – ప్రవేశపెట్టిన ప్రభుత్వం
అసెంబ్లీలో ‘ఓట్ ఆన్ అకౌంట్’ బడ్జెట్ ప్రవేశ పెట్టిన డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క, మండలిలో మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణ త్యాగమూర్తుల ఆశయసాధన కోసం మా కార్యాచరణ
* భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు.
* తెలంగాణ త్యాగమూర్తుల ఆశయసాధన కోసం మా కార్యాచరణ
* అందరి కోసం మనమందరం అనే నూతన స్ఫూర్తితో పనిచేస్తున్నాం
* ప్రజలకు అందుబాటులో ఉండే పాలనకు శ్రీకారం చుట్టాం
* గుణాత్మక మార్పు తీసుకురావాలనేది మా కృతనిశ్చయం
2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టిన ప్రభుత్వం. రూ.2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్.
రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు
మూలధన వ్యయం రూ.29,669 కోట్లు
ఆరు గ్యారంటీలకు రూ.53,196 కోట్లు
వ్యవసాయానికి రూ.19,746 కోట్లు
ఐటీ శాఖకు రూ.774 కోట్లు
పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు
మూసీ ప్రాజెక్టుకు రూ.1,000 కోట్లు
విద్యా రంగానికి రూ.21,389 కోట్లు
వైద్య రంగానికి రూ.11,500 కోట్లు
ఎస్సీ సంక్షేమ శాఖకు రూ.21,874 కోట్లు
గృహనిర్మాణానికి రూ.7,740 కోట్లు
మైనారిటీ సంక్షేమ శాఖకు రూ.2,262 కోట్లు
కీలక శాఖలకు కేటాయింపులు ఇలా..
నీటిపారుదల శాఖకు రూ. 28,024 కోట్లు
గృహజ్యోతి పథకానికి రూ. 2,418 కోట్లు
ట్రాన్స్‌కో, డిస్కమ్‌లకు రూ. 16,825 కోట్లు
బీసీ గురుకులాల స్వంత భవనాల నిర్మాణానికి రూ. 1,546 కోట్లు
బీసీ సంక్షేమానికి రూ. 8,000 కోట్లు
ఎస్సీ గురుకులాల భవన నిర్మాణాలకు రూ. 1000 కోట్లు
ఎస్టీ గురుకులాల భవన నిర్మాణాలకు రూ. 250 కోట్లు
తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు 500 కోట్లు.
యూనివర్సిటీల్లో సదుపాయాలకు 500 కోట్లు



