- Advertisement -
తిరుమల రథ సప్తమి వేడుకలకు భారీ బందోబస్తు
Huge arrangement for Tirumala Ratha Saptami celebrations
తిరుమల
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి ఏటా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు… ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ రోజు బందోబస్తు విధులకు హాజరైన సిబ్బందికి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రావు రు తిరుమల ఎస్.వి హై స్కూల్ గ్రౌండ్ లో సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ శ్రీవారి రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్న నేపథ్యంలో శ్రీ సుమారు 2 లక్షలు పైగా భక్తులు హాజరవుతారు. తదనుగుణంగా సుమారు 1400 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
ఉదయం 5:30am గంటలకు సూర్యప్రభ వాహనంతో ప్రారంభమయ్యే ఈ మహత్తరమైన వేడుకలలో గరుడ వాహనం మరియు చక్ర స్నానానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కావున దానికి అనుగుణంగా బందోబస్తు పోలీసు అధికారులు, సిబ్బంది సిద్దంగా ఉండాలన్నారు. పోలీసులు భక్తులతో గౌరవంగా, మర్యాదపూర్వకంగా మెలగి రథసప్తమి రోజున ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకొనే విధంగా చర్యలు చేపట్టామన్నారు.
చిన్నపిల్లలు తప్పిపోకుండా ఉండేందుకు పిల్లలకు తప్పనిసరిగా వారి తల్లిదండ్రుల వివరాలు, ఫోన్ నెంబర్లను తెలియజేసే జీయో ట్యాగింగ్ ను అమలు చేస్తున్నాము. దయచేసి పిల్లల తల్లిదండ్రులు పోలీసులకు సహకరించి, ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని భక్తులను కోరారు
- Advertisement -