నేను కాంగ్రెస్ లో చేరడంలేదు
డిప్యూటీ మేయర్ శ్రీలత
సికింద్రాబాద్
కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వస్తున్న పుకార్లకు హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతె శ్రీ లతా శోభన్ రెడ్డి కొట్టి పారేశారు. సికింద్రాబాద్ లోని జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన సికింద్రాబాద్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ లో పాల్గొన్న డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ ఈ జోనల్ పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించడం కోసం చర్చించడం జరిగిందని తెలిపారు. ఈ రోజు పెళ్ళిలు ఎక్కువగా ఉండడంతో మధ్యాహ్నం వరకే సమావేశం జరపడం జరిగిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ కూడా వారి చేతిలోనే ఉండడం వలననే రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగిందని అన్నారు. ఇందులో రాజకీయాల ప్రస్తావనే లేదని చెప్పారు. మేము స్వతహాగా వెళ్లి కలవడం జరిగిందని, ఇందులో మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసి యుద్దిన్ ప్రమేయం లేదని, అక్కడ యాదృచ్ఛికంగా కలిసి మాతో పాటు పోటో దిగడం జరిగిందని వివరించారు. బాబా ఫసియుద్దిన్ సామాజిక మాధ్యమాల్లో మేము కాంగ్రెస్ లో చేరుతున్నట్లు పోస్ట్ చేసిన విషయం మాకు తెలియదని స్పష్టం చేశారు.
నేను కాంగ్రెస్ లో చేరడంలేదు
- Advertisement -
- Advertisement -