- Advertisement -
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీస్తే ఊరుకునే ప్రసక్తే లేదు
If Hyderabad's brand image gets damaged, there is no point in taking it easy
– మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీసే విధంగా ఎవరు వ్యవహరించినా వివరించిన ఊరుకునే ప్రసక్తే లేదని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ – మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో మధ్య నిషేధం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన హైదరాబాద్ ఇన్చార్జ్ మంత్రిగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఫామ్ హౌస్ లో భయభ్రాంతులకు గురి చేసే విధంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసి హైదరాబాద్ ఆర్థికంగా దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చట్టంలో ఉన్న విధంగా ఫంక్షన్ లు కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఫంక్షన్లు చేసుకునేటప్పుడు ఎక్సైజ్ నిబంధనల మేరకు మద్యం అనుమతులు తీసుకోవాలి. ముఖ్యమంత్రి, మంత్రులకు ఫామ్ హౌస్ లలో జరుగుతున్న కార్యక్రమాలపై అవసరము లేదు. అక్కడ జరుగుతున్న ఫామ్ హౌస్ లో డిస్టబెన్స్ పై ఫిర్యాదు మేరకే పోలీసులు దాడి చేశారు. అక్కడ అనుమతులు లేని విదేశీ మద్యం దొరికింది. కేసు రిజిస్టర్ చేశారు.. దాని తదుపరి జరిపిన పరీక్షల్లో డ్రగ్స్ తీసుకున్నట్లు వెళ్లడైంది. తరువాత నార్కోటిక్ డ్రగ్స్ కేసుగా నమోదు చేశారు. మేము వెళ్లి రాజకీయంగా ఎవరిమీద కేసు పెట్టాలని చూడలేదు. అక్కడ పంప్ జరుగుతున్న పార్టీపై పోలీసులు కేసు నమోదు చేశారు అది రాజకీయంగా కేసీఆర్ బావమరిది కావడంతో మీడియా అట్రాక్ట్ అయిందని అన్నారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిబండి సంజయ్ పోలీసుల మనోధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు.. బండి సంజయ్ మాట్లాడిన తర్వాత పోలీసులు సమర్థవంతంగా పనిచేయడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఎదురవుతుంది. చట్టాన్ని ,న్యాయాన్ని పోలీసులు ఎటువంటి విచక్షణ వివక్ష లేకుండా దర్యాప్తు చేయాలని కోరుతున్నా. అర్ధరాత్రి డిజె సౌండ్ పెట్టి పక్క వాళ్లకు ఇబ్బంది కలిగే ప్రయత్నం చేస్తే పోలీసులు అక్కడికి వెళ్లి దాడి చేశారు అది విఐపి బామ్మర్ది కావడం వల్ల మీడియా అక్కడికి వెళ్లింది. ఇందులో ముఖ్యమంత్రి ,మంత్రుల కుట్ర ఉందని అంటున్నారు. మా ప్రభుత్వానికి ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు లేవు. మీ కన్నా మంచిగా ఈ ప్రభుత్వాన్ని నడిపి ప్రజల్లో ప్రశంసలు పొంది ప్రయత్నం చేస్తున్నాం. ప్రజల దృష్టి మళ్లించడానికి కక్ష సాధింపు ధోరణి అని ప్రయత్నం చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలకు రాజకీయ కక్షలు ఉంటాయి జాతీయ పార్టీలకు రాజకీయ కక్షలు ఉండవని అన్నారు.
- Advertisement -